For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'విశ్వరూపం-2' ఎందుకు ఇంత లేటు? కమల్ సమాధానం

By Srikanya
|

చెన్నై : కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం-2' రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తైనా విడుదల కావటం లేదు. అయితే ఇలా విడుదల ఆలస్యం కావటానికి కారణం నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అని తేల్చారు కమల్ హాసన్.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కమల్ హాసన్ మాట్లాడుతూ.... " నాకు ఈ చిత్రం ఎందుకు విడుదల లేటవుతోందో తెలియదు. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిర్ణయించుకోవాలి. అసలు ఈ చిత్రం విడుదల కాకుండా ఎందుకు ఆగుతుందో కారణం తెలుసుకోవాలి." "ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా నేను ఐడిల్ గా కూర్చోలేను. అందుకే నేను ఉత్తమ విలన్, పాప నాశమ్ చిత్రాలు చేసాను ." అన్నారు.

Why Viswaroopam 2 delayed? Here is Kamal's reply

సంచలనాలకు వేదికగా నిలిచిన 'విశ్వరూపం' సినిమాకు సీక్వెల్‌ వస్తుందని ఏడాదిగా ఊరిస్తున్నాడు కమల్‌హాసన్‌. ఎప్పటికప్పుడు వాయిదాపడుతూవస్తోంది. తొలిభాగం మొత్తం విదేశీ నేపథ్యంలో తీసిన కమల్‌హాసన్‌..రెండో పార్ట్‌ మొత్తం ఇండియాలో సాగుతుందని చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే షూటింగ్‌ అయిపోయింది. పోస్ట్‌ప్రొడక్షన్‌ జరుగుతోందని ఏడాది నుంచి వార్తలొస్తున్నాయి కానీ సినిమా విడుదల సంగతే తేలడం లేదు.

విశ్వరూపం-2 విషయం మాట్లాడకుండా ఉత్తమ విలన్‌ పనుల్లో పడిపోయి చకచకా సినిమా పూర్తి చేసేసిన కమల్‌..ఆతర్వాత దృశ్యం రీమేక్‌ 'పాపనాశం షూటింగులోకి దిగిపోయాడు. దీంతో విశ్వరూపం-2 గురించి అప్‌డేట్‌ లేక అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా గురించి ఈ కబురు అందింది.

మరో ప్రక్క ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కమలహాసన్ 'విశ్వరూపం-2' చిత్రం ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. కమల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలు అనుకున్న విధంగా రాలేదట. దాంతో కమల్‌హాసన్ అసంతృప్తిగా ఉన్నారని భోగట్టా. ఈ సన్నివేశాలను రీషూట్ చేయాలని ఆయన అనుకుంటున్నారట.

'విశ్వరూపం' పలు వివాదాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ రెండో భాగం పరంగా కమల్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన నటించిన మలయాళ 'దృశ్యం' తమిళ రీమేక్ 'పాపనాశం', 'ఉత్తమవిలన్' విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి.. 'విశ్వరూపం -2' విడుదల ఎప్పుడనేది ప్రశ్నే.

ఆ మధ్యన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజై అందరి మన్ననలూ పొందింది. విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్‌ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. ఇప్పుడు విశ్వరూపం-2ని తీర్చిదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు కమల్‌.

English summary
Kamal Hassan revealed why his Viswaroopam 2 is getting delayed. Kamal, said, "I don't know why the film is delayed from release. Aascar Ravichandran, the producer of Vishwaroopam 2, must decide when to release the film. But I am yet to know the correct reason for holding my film back from release." Adding, "I cannot sit idle till the film gets released, and that's why, I am done with two films now - one is Utthama Villain and the other one is Papanasam."
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more