నాపై కుట్ర పన్నుతున్నారని హీరోయిన్ గోల..
అలాగే..అజిత్, విజయ్ చిత్రాల్లో నటించనని చెప్పటం అబద్ధం. తమిళంలో ఓ సామెత ఉంది.. 'కరుంబు తిన్న కూలి కేప్పాంగలా?' (చెరకు తినేందుకు కూలీ అడుగుతారా) అని! అజిత్, విజయ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా... చెప్పండి. ఇలాంటి అద్భుత అవకాశాలను నా చేజేతులా పోగొట్టుకుంటానా? అని అడుగుతోంది.
రెండు హిట్స్ రావటం గురించి చెప్తూ...ఒక ఇంటర్వ్యూలోనో, రెండు మాటల్లోనే చెప్పే విషయం కాదది. వర్ణించలేనంత సంతోషంగా ఉన్నా. నా తొలి చిత్రం 'గుమ్కీ'. కానీ 'సుందర పాండియన్' తొలుత విడుదలైంది. మంచి విజయాన్ని అందించింది. 'గుమ్కీ' నన్ను మరో మెట్టు ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ రెండు సినిమాలతో చాలా అవకాశాలు వస్తున్నాయి. వాటన్నింటిలో కథా బలాన్ని చూసి ఎంపిక చేస్తున్నా అంది. ప్రస్తకుతం నటుడు శశికుమార్‌తో 'సుందరపాండియన్' తర్వాత మళ్లీ 'కుట్టిపులి'లో జతకడుతోంది. 'మంజా పయ్' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications












