తమిళ నటుడి భార్య ఆత్మహత్య.. ఇంట్లోనే భర్త, అనుమానాస్పదంగా!
వర్తమాన నటుడు సిద్ధార్థ్ గోపినాథ్ సతీమణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సిద్ధార్థ్ తమిళ చిత్రాల్లో ఇప్పుడిపుడే అవకాశాలు అందుకుం రాణిస్తున్నాడు. గత రాత్రే అతడి ఇంట్లో ఈవిషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానకర పరిస్థితుల్లో మరణించిన అతడి సతీమణిని స్మృజ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు.

భార్య భర్తలిద్దరూ
నిన్న సాయంత్రం భార్య భర్తలు ఇద్దరూ బయటకు వెళ్లి వచ్చారు. ఆ తరువాతే ఇంట్లో గొడవ ప్రారంభమైనట్లు ఇరుగు పొరుగువారు చెబుతున్నారు వ్యక్తిగత విషయాలకు సంబంధించి వీరి మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.

పడక గదిలోనే
తన భార్యతో గొడవ జరగడంతో సిద్దార్థ్ ఇంటి హల్ లో పడుకున్నాడట. స్మృజ మాత్రం పడక గదిలోనే పడుకుంది. కానీ ఉదయం డోర్ కొట్టిన స్పందన లేకపోవడంతో డోర్ బద్దలు కొట్టి చూస్తే..స్మృజ సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించింది.

ఇంట్లోనే
భర్త ఇంట్లో ఉండగానే స్మృజ మరణించడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు కుటుంబ సభ్యులు, మిత్రులని విచరిస్తున్నారు. స్మృజ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి? వీరి వివాహానికి సంబందించిన వివరాలని పోలీసులు తెలుసుకుంటున్నారు.

మలుపు చిత్రంలో
సిద్దార్థ్ గోపినాథ్ 2015 లో యాగవరయినుమ్ నా కాక్క అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో హీరో. మలుపు పేరుతో తెలుగులో ఈ చిత్రం విడుదలైంది.


Click it and Unblock the Notifications











