మామతో కలసి నటించబోతున్న ఐశ్వర్యారాయ్.. స్టార్ హీరోలతో ప్రయోగం!
నవాబ్(తమిళంలో చెక్క చివంత వానమ్) చిత్రంతో స్టార్ దర్శకుడు మణిరత్నం చాలా రోజుల తర్వాత విజయాన్ని అందుకున్నారు. శింబు, అరవింద స్వామి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ ఉత్సాహంతో మణిరత్నం మరో భారీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఓ నవల ఆధారంగా మణిరత్నం ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో స్టార్ హీరోలని నటింపజేసేందుకు మణిరత్నం ప్రయత్నిస్తున్నారట. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

మామతో కలసి
తాజాగా వస్తున్న వార్తల ప్రకారం మరోమారు ఐశ్వర్యారాయ్ మణిరత్నం దర్శత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికర అంశం ఏంటంటే మణిరత్నం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ని కూడా ఈ చిత్రం కోసం సంప్రదిస్తున్నారట. మామ, కోడలు కలసి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్యారాయ్, అమితాబ్ కలసి ఒకే చిత్రంలో నటిస్తే అంచనాలు పెరగడం ఖాయం.

క్రేజీ హీరోలంతా
ఈ చిత్రంలో శింబు, విజయ్, చియాన్ విక్రమ్ లాంటి క్రేజీ హీరోలు నటిస్తున్నారట. వాళ్లంతా మణిరత్నం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యారాయ్, అమితాబ్ నుంచి స్పందన రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఐశ్వర్యరాయ్ ఇద్దరు, గురు, విలన్ లాంటి చిత్రాల్లో మణిరత్నం దర్శత్వంలో నటించింది. ప్రస్తుతం మణిరత్నం కథపై, నటీనటులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సంక్రాంతికి ప్రకటన
ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన సంక్రాంతికి వెలువడనున్నట్లు తెలుస్తోంది. తన దర్శకత్వ ప్రతిభతో మణిరత్నం అద్భుతమైన ఎమోషన్ ని పండించగలరు. గతంలో ఆయన చిత్రాలు అలానే ఉండేవి. ప్రస్తుతం మణిరత్నం మల్టీస్టారర్ చిత్రాలపై దృష్టిపెట్టాడు.

తగ్గిన జోరు
ఇటీవల ఐశ్వర్యరాయ్ సినిమాల పరంగా జోరు తగ్గించింది. గత రెండేళ్లలో ఐశ్వర్య రాయ్ నుంచి ఫ్యాని ఖాన్ అనే చిత్రం మాత్రమే వచ్చింది. ఆ మధ్యన తాన్ భర్తతో కలసి ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ చిత్రానికి సంబందించి క్లారిటీ ఇంకా రాలేదు. మణిరత్నం సినిమా విషయంలో మామ, కోడలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











