కార్తిక భవిష్యత్తు ప్రశ్నార్థకం??
'జోష్' చిత్రం ద్వారా పరిచయమైన నాయిక కార్తిక. నిన్నటి తరం నాయిక రాధ కుమార్తె అయినందున మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ సినిమా కాస్త ఫ్లాపవడంతో కార్తిక పరిస్థితి సందిగ్ధంలో పడింది. నటన బాగానే చేసినా నల్ల పిల్ల అని, గ్లామరస్ గా లేదని తెలుగు దర్శకనిర్మాతలు పెదవి విరిచారు. దీంతో ఆమెకు ఆశించినంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె తల్లి రాధ రంగంలోకి దిగి ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. కోలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోందట.
'జోష్' సినిమాకు ముందే తమ చిత్రాల్లో కార్తికను నటింపజేయాలని ప్రయత్నించిన తమిళ దర్శకులు ఈ సినిమా విడుదలయ్యే వరకూ వేచి చూడాలని నిర్ణయించుకున్నారట. తీరా సినిమాలో ఆమెను చూసి ఏమంత బాలేదు అని కమెంట్ చేశారట. కానీ కార్తిక మాత్రం తను తన తల్లి రాధలాగే మంచి నటి అని పేరుతెచ్చుకోవాలనే పట్టుదలతో వుండట. ఏదేమైనా కార్తిక తన అందం కన్నా, నటనతోనే నెట్టుకురాలనేది అందరి అభిప్రాయం.


Click it and Unblock the Notifications











