రజనీ సింగపూర్ నుండి రాగానే అడ్రస్ మారుతోంది..!?

By Sindhu

సింగపూర్‌లో విశ్రాంతి తీసుకుంటున్న తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్ కోసం చెన్నై నగర శివారులో కొత్త ఇల్లు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అనారోగ్యం కారణంగా సింగపూర్‌ లోని ఆస్పత్రిలో చికిత్స పొందిన రజనీ ప్రస్తుతం అక్కడే ఓ ఇంటిని అద్దెకుతీసుకుని విశ్రాంతి పొందుతున్నారు. మరో రెండు నెలల్లో ఆయన చెన్నై వచ్చే అవకాశముంది. ఆయనిక్కడికి చేరుకున్నప్పటికీ నెల రోజుల పాటు కాలుష్యరహిత ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో కేలంబాక్కంలో కొత్త ఇంటిని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం రజనీ ఉంటున్న ఇల్లు చెన్నై పోయెస్ గార్డెన్‌ లో ఉంది. అక్కడ ట్రాఫిక్ సమస్య, వాహనాల రణగొణ ధ్వనులు, వాతావరణ కాలుష్యం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని నగర శివారు ప్రాంతంలో విశ్రాంతి తీసుకునేందుకే రజనీ మొగ్గుచూపుతున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా ఆయన సతీమణి లతా రజనీకాంత్ గురువారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో హఠాత్తుగా దర్శనమిచ్చారు. ఆమెను గుర్తించిన కస్టమ్స్ అధికారులు, ప్రయాణికులు రజనీ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజనీ ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలో చెన్నై చేరుకుంటారని చెప్పారు. సో రజనీకాంత్ ఫ్యాన్స్ చాలా సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నారు. రజనీకాంత్ తదుపరిచిత్రం రానా ఈ సంవత్సరం చివరన మొదలౌతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X