రామ్ గోపాల్ వర్మ బిజినెస్ మైండ్ తో సూర్య బలిపశువు అవుతాడా...?
రామ్ గోపాల్ వర్మ, దర్శకత్వంలో రూపొందిన 'రక్త చరిత్ర 2" లో మద్దెల చెరువు సూరిగా తమిళ హీరో సూర్య నటించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆశించినంత హిట్ అవ్వలేదు. పైగా ఈ పాత్ర చేసినందుకు సూర్య అంత హ్యాపీగా లేడని తెలుస్తోంది. సూర్య నటనకు మంచి మార్కులు పడినప్పటికీ బాలీవుడ్ లో కోలీవుడ్ లో ఈ చిత్రం ప్లాప్ చిత్రంగానే నమోదయ్యింది.
మళ్ళీ సూర్యతో రామ్ గోపాల్ వర్మ 'ది బిజినెస్ మ్యాన్" అనే చిత్రం చేయాలని అనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలో చేయాలని రామూ భావిస్తున్నాడు. 'రక్త చరిత్ర" రిజల్ట్ తో ఖంగుతిన్న సూర్య మరోసారి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడానికి సిద్దపడతాడా?అనే చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే తన బిజినెస్ మైండ్ తో సూర్యను అడ్డం పెట్టుకొని 'రక్త చరిత్ర" తో సొమ్ము చేసుకున్నాడు. కానీ సూర్యకు బాలీవుడ్ రంగప్రవేశం చేసాననే ఆనందం తప్ప ఏం మిగలలేదు. అలాంటప్పుడు మరోసారి రామూ మాయలోపడి బలిపశువు అవ్వడానికి సూర్య సిద్దపడతాడా?లేదా అన్నది తెలియాల్సివుంది.


Click it and Unblock the Notifications











