'...రాంబాబు' తమిళ రీమేక్ కి హీరో వెయిటింగ్
చెన్నై : 2007 లో వచ్చిన తమిళ పోకిరి చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాధ్ రూపొందించిన పోకిరి చిత్రం రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం తర్వాత మళ్లీ విజయ్ దృష్టి ఈ చిత్రంపై పడిందని చెన్నై సమాచారం. దాంతో విజయ్ పూర్తిగా ఈ చిత్రం ప్రమోషన్,రిలీజ్ అన్నీ గమనిస్తున్నాడని, ఇప్పటికే ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం నిర్మాతని సంప్రదించారని సమాచారం. రేపు చిత్రం విడుదల రిపోర్ట్ ని బట్టి చిత్రం రీమేక్ రైట్స్ తీసుకునే అవకాసం ఉంది. విజయ్ గానీ,ఆయనకు సంభందించిన దర్శకులు గానీ ఈ చిత్రం రేపు చెన్నై లో చూసి ఓ నిర్ణయానికి వస్తారు. అయితే తమిళనాడులో కూడా ఎక్కువ ప్రింట్స్ తో స్టైయిట్ సినిమాలా చిత్రాలు విడుదల కావటం తమిళ రీమేక్ హీరోలకు కంటకంగా మారింది.
'కెమెరామెన్ గంగతో రాంబాబు' అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. పేపర్లో, టీవీలో న్యూస్ చూసి స్పందించే కుర్రాడు జర్నలిస్ట్ అయితే ఎలా ఉంటుందో రాంబాబు పాత్ర అలా ఉంటుంది. మన రాష్ట్రంలో వచ్చిన ఒక పెద్ద సమస్యని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది సినిమా కథ.
రాంబాబు అనే జర్నలిస్ట్ రానా బాబు అనే రాజకీయ నాయకుడి తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపిస్తున్నాం. రాంబాబు పాత్రని పవన్ కళ్యాణ్ చేస్తూంటే,రానా బాబు పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. పవన్ కి ఈ సినిమా కథ, కంటెంట్, రాంబాబు పాత్ర చాలా బాగా నచ్చాయి. ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి అంటున్నారు పూరీ జగన్నాధ్ .
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











