యువన్ శంకర్ రాజా: మతంతో పాటు పేరు కూడా మార్పు
హైదరాబాద్: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తనయుడు, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఇస్లాం మంతంలోకి మారిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన పేరును కూడా అధికారికంగా మార్చుకోతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతోన్న ‘మాస్' చిత్రంలో యువన్ శంకర్ రాజా కొత్త పేరు దర్శనమియనుందట. మహ్మద్ యువన్ అని అతని పేరు మాచ్చుకున్నట్లు సమాచారం.

మతం మారడం వెనక కారణాన్ని యువన్ శంకర్ రాజా వివరిస్తూ... ''మత మార్పునకు కారణం అమ్మే. ఆమె అనారోగ్యం పాలైనప్పుడు ముంబయిలో ఉన్నా. వెంటనే చెన్నైకి వచ్చా. సోదరితో కలిసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లా. ఆమె నా చెయ్యి పట్టుకుని ఆవేదన చెందారు. తరువాత దూరమయ్యారు. అమ్మ ఏమైపోయిందోనని ఆలోచించా. ఆమె ఆత్మ ఎలా రూపాంతరం చెందిందోనని వెతకడం ప్రారంభించా.
నా ముస్లిం స్నేహితుడొకరు.. మక్కాలో తాను ప్రార్థన చేసిన చాపను నాకు ఇచ్చారు. గుండె భారంగా ఉన్నప్పుడు దీనిపై కూర్చోమని చెప్పారు. దాన్ని నా గదిలో పెట్టేశాను. ఓ సారి మరో మిత్రుడితో అమ్మ గురించి మాట్లాడుతుండగా ఆ చాపపై కూర్చున్నా. ఖురాన్ పఠించడం ప్రారంభించా. జనవరిలో మతం మారుతానని నాన్నతో చెప్పా. అడ్డుకోలేదు. ఆ తరుణంలోనే అమ్మ నా చేయి పట్టుకుని 'నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఇస్లాం అనే మహావృక్షం కింద కూర్చోమని సలహా ఇచ్చినట్లు అనిపించింది. అలా మతం మారాను'' అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











