»   » టెన్షన్: ప్రకాష్‌రాజ్‌పై హైకోర్టులో మహిళ కేసు

టెన్షన్: ప్రకాష్‌రాజ్‌పై హైకోర్టులో మహిళ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: యాడ్ లకు సంభందించి ప్రజాహిత వాజ్యాలు ఈ మధ్య కాలంలో కోర్టుకు చాలా వస్తున్నాయి. తాజాగా అలాంటి వాజ్యం ఒకటి ప్రకాష్ రాజ్ ని చుట్టుకోబోయి ఆగింది. ఒక బంగారు నగల దుకాణానికి సంబంధించిన కమర్షియల్ యాడ్ లో కనిపించిన సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అయితే హైకోర్టు ఆ వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ఎస్‌.సైఫియాత్‌ అనే మహిళ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

Woman drags Prakash Raj to court over sexist advertisment

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ ప్రకటన మహిళలను కించపరిచేలా ఉందని, ఇందులో నటించిన నటుడు ప్రకాష్‌రాజ్‌ను, చెన్నై నగర పోలీసు కమిషనర్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌లను నిందితులుగా చేర్చి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తన వ్యాజ్యంలో న్యాయస్థానాన్ని కోరారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కిషన్‌కౌల్‌, జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానంలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. 'పిటిషనర్‌ కేవలం నటుడు ప్రకాష్‌ రాజ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాజ్యం దాఖలు చేశారని' పేర్కొంది.

Woman drags Prakash Raj to court over sexist advertisment

ఈ యాడ్ లో ప్రకాష్ రాజ్...'every girl who reaches her marrying age is a tension'. అదే ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది.

ఈ విషయమై ప్రకాష్ రాజ్ వరస ట్వీట్స్ చేసారు. ఆ చేసిన ట్వీట్స్ ని ఇక్కడ చూడండి.

English summary
A series of teaser advertisements for a jewellery brand calls women in marriagable age as 'tension.' Objecting to an advertisement, which was allegedly “degrading and demeaning” women and girls of marriageable age, a Public Interest Litigation was filed in the Madras High Court seeking to take action against actor Prakash Raj, who had endorsed the advertisement. When petitioner S. Safiath of Villivakkam mentioned the issue before a Division Bench comprising Justices T.S. Sivagnanam and G. Chockalingam, the judges directed court staff to help the petitioner in getting the petition numbered.
Please Wait while comments are loading...