twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అత్యాచార కేసు గెలిచిన సినీ విలన్... 50 లక్షలు పరిహారం

    By Srikanya
    |

    చెన్నై: అత్యాచార కేసులో ఇరుక్కున సినీ నటుడు మన్సూర్ అలీఖాన్‌కు కోర్టు నుంచి ఊరట లభించింది . కేసు పూర్వా పరాలు విచారించిన కోర్టు...ఆయనపై అత్యాచార నేరాన్ని మోపిన మహిళకు కోర్టు అక్షింతలు వేసింది. మన్సూర్ అలీఖాన్ కు రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆమెను ఆదేశించింది. దాంతో ఆయన అభిమానులు,కుటుంబసభ్యులు ఆనదంతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

    విజయ్ కాంత్ నటించిన కెప్టెన్ ప్రభాకర్ చిత్రంతో స్మగ్లర్ వీరప్పన్ నటించిన పాపులర్ అయిన మన్సూరి అలీ ఖాన్ తర్వాత అనేక చిత్రాల్లో విలన్ గా చేసారు. తన సినీ కెరీర్ సవ్యంగా సాగుతూ ముందుకు వెళ్తోందనుకున్న సమయంలో ఆయన హీరోగానూ సినిమాలు చేసారు. అత్యాతార కేసు పడింది. ఈ లోగా 1998లో తనపై మన్సూర్ అలీఖాన్ అత్యాచారం చేశాడంటూ స్నేహ కోడంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితిమన్సూర్ అలీఖాన్‌కు ఏర్పడింది.

    సెషన్స్ కోర్టు ఏడేళ్ల కారాగార వాసం రూ.3.5 లక్షల జరిమానా విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మన్సూర్ అలీ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అప్పటి న్యాయమూర్తి రఘుపతి మన్సూర్ అలీఖాన్‌ను నిర్ధోషిగా ప్రకటించారు. 2007లో వచ్చిన తీర్పులో ఆయన శిక్షా కాలాన్ని రద్దు చేశారు. ఈ పరిస్థితుల్లో తనపై మోపిన ఆధార రహిత ఆరోపణల కారణంగా సినీ అవకాశాలు లేకుండా పోయాయని, తాను అవమానం పాలయ్యానని, మానసిక క్షోభ అనుభవిస్తున్నానని హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఆరోపణలు చేసిన స్నేహపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు రూ.50 లక్షలు నష్ట పరిహారం ఇప్పించాలని విన్నవించుకున్నారు.

    మన్సూర్ వేసిన పిటిషన్ విచారణ కొన్ని నెలలుగా న్యాయమూర్తి మదివానన్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తోంది. పిటిషనర్ తరపున న్యాయవాది ఏఆర్ నిక్సన్ వాదనలు విన్పించారు. న్యాయమూర్తి మదివానన్ సోమవారం తీర్పు వెలువరించారు. మన్సూర్ అలీఖాన్ ఆధారాలతో సహా తనకు జరిగిన అవమానాన్ని నిరూపించారని తెలిపారు. తప్పుడు ఫిర్యాదు చేసిన స్నేహ కోర్టు విచారణకు సైతం సహకరించలేదని పేర్కొంటూ అక్షింతలు వేశారు. కుట్ర పూరితంగా మన్సూర్ అలీఖాన్ పై ఆరోపణలు చేసినట్టు నిరూపితమైందని పేర్కొన్నారు. మన్సూర్ అలీఖాన్‌కు రూ.50 లక్షలు నష్ట పరిహారాన్ని స్నేహ చెల్లించాలని తీర్పు చెప్పారు. ఇది కాస్త నటుడు మన్సూర్ అలీఖాన్‌కు జాక్ పాట్ తగిలినంత ఆనందాన్ని ఇచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.

    English summary
    The Madras High Court on Monday directed a woman to pay Rs 50 lakh as damages towards the 'malicious prosecution' and defamation suffered by an actor. Justice T Mathivanan gave the direction and passed an ex-party order on a civil suit from actor Mansoor Ali Khan recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X