twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ వివాదాస్పద వాఖ్యలకి మహిళా సంఘాల మధ్దతు

    By Srikanya
    |

    చెన్నై : 'టిష్యూపేపర్' వివాదంతో గత వారం రోజులుగా వార్తలు నిలిచిన తమిళ హీరోయిన్ సోనీకి మహిళా సంఘాల మద్దతు లభించింది. తమిళనాడు పురుషుల భద్రతా సంఘంతో ఒంటరిపోరు చేస్తున్న నటి సోనాకు మహిళా సంఘం మద్దతు పలికింది. మహిళను ఒంటరి చేసి ఇంత మంది పురుషులు ఆమె ఇంటిని ముట్టడిస్తారా..? ఇకపై ఆందోళనలు మానకపోతే ఖబడ్దార్ అంటూ పురుషుల సంఘాన్ని హెచ్చరించింది.

    ఓ ప్రముఖ వార పత్రికలో మగవారిని ఉద్దేశించి నటి సోనా పురుషులను టిష్యూ పేపర్‌తో పోల్చి వివాదాన్ని కోరి తెచ్చుకున్న నటి సోనాపై తమిళనాడు పురుషుల భద్రతా సంఘం, హిందూ మక్కల్ కట్చి పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. సోమవారం ప్రపంచ పురుషుల భద్రతా దినోత్సవం నేపథ్యంలో సోనా ఇంటిని ముట్టడించి ఆందోళనలు చేపట్టడంతో పాటు సోనా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నటి సోనాకు నగరంలోని ఝాన్సీ రాణి మహిళా సంఘం మద్దతుగా నిలిచింది. తమిళనాడు పురుషుల సంఘం సోనాపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తున్నారని మండిపడింది.

    సంఘం అధ్యక్షురాలు కల్పన ఓ ప్రకటన విడుదల చేస్తూ..మగవారిని ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని సోనా వివరణ ఇచ్చిన నేపథ్యంలో తమిళనాడు పురుషుల భద్రతా సంఘం ఆమె ఇంటిని ముట్టడించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఓ మహిళ ఇంటిని అంత మంది పురుషులు ముట్టడించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సోనా మగవారిని కించపరిచే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఉంటే కోర్టు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అంతేకానీ ఆమెను మానసికంగా కుంగదీసే రీతిలో రోడ్డుపై పడి ఆందోళనలు చేపట్టడం, ఆమె ఇంటిని, కార్యాలయాన్ని ముట్టడించి హంగామా చేయడం తగదని అన్నారు.

    ఇకపై సోనాకు వ్యతిరేకంగా పురుషుల సంఘం ఆందోళన చేపడితే మహిళా సంఘం తరుపున తాము ఆమెకు మద్దతుగా నిలుస్తామని వెల్లడించారు. ఇదిలా వుండగా, దక్షిణ భారత నటుల సంఘంలో నటి సోనా వివాదంపై వివరణ ఇచ్చారు. తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పురుషులను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకున్నారు.

    ప్రపంచ పురుషుల దినోత్సవం సందర్భంగా తమిళనాడు పురుషుల భద్రతా సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్ తమిళన్ నేతృత్వంలోని పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు తేనాంపేటలోని సోనా ఇంటిని ముట్టడించారు. అక్కడే సోనా నిర్వహిస్తున్న యూనిక్ సంస్థ వుండగా, ఆ సంస్థ కార్యాలయం ముందు బైఠాయించి సోనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందకు పైగా ఆందోళనకారులు అక్కడ గుమికూడి సోనా ఇంటి బైఠాయించి వాహనాలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న తేనాంపేట పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఆందోళనకారులు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.

    English summary
    
 women’s welfare organizations have been pitching support by way of letters and calling Actress Sona. Kalpana, Head of Jhansi Rani Women’s Protective Association supported in Tissue issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X