నమిత, శ్రియ, నయనతార లపై మండిపాటు
సాంప్రదాయలను వదిలి వృత్తిని అడ్డం పెట్టుకొని లేనిపోని ప్యాషన్లు సినిమాలు, ఫ్యాషన్ షోల ద్వార అసభ్యకర దుస్తులు, అర్థనగ్న దుస్తులు దరిస్తుండటంతోనే సభ్య సమాజం చెడిపోతుందంటూ అప్పుడప్పుడు అక్కడక్కడా అభ్యంతరాలు వింటూనే వుంటాము. చూసే వారుండగా చూపించే వారికి కొదవా అన్నట్టు ఎంచక్కా నమిత, శ్రియ, నయనతార, కురచ దుస్తులేసుకొని జనాలను ఆకట్టుకుంటుంటే మహిళా సంఘాలకు అది గిట్టినట్టు లేదు.
ఆ మధ్య శ్రియ 'మల్లన్న" సినిమాలోనూ, నయనతార 'బిల్లా" సినిమాలోనూ, నమిత ఐతే ప్రతి సినిమాలోనూ....కురచదుస్తులే వేసుకొన్నందుకు, చెన్నయ్ కి చెందిన ఓ మహిళా సంఘం ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించిందట. ఈ ర్యాలీలో శ్రియ, నయనతార, నమిత.... కురచ దుస్తులు వేస్తున్నందుకు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. వృత్తిరీత్యా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కురచ దుస్తులేసుకుంటుంటే మధ్యలో వీళ్లకి ఏమొచ్చిందోనని శృంగారప్రియులు తిట్టుకుంటున్నారట.


Click it and Unblock the Notifications