twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీతో చేయటం విపరీతమైన ఖర్చు : కమల్ హాసన్

    By Srikanya
    |

    చెన్నై : రజనీకాంత్‌, కమల్‌హాసన్‌... గతంలో కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు కూడా వారిద్దరినీ తెర మీద చూడాలని చాన్నాళ్లుగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయం గురించి కమల్‌ దగ్గర ప్రస్తావిస్తే ఆయన నవ్వి కొట్టిపారేసారు. కమల్ మాటల్లోనే... ''మేమిద్దరం నటించాలంటే ఆ సినిమాకు ఖర్చు మామూలుగా ఉండదు. ఎన్ని డబ్బులున్నా సరిపోదు. అందుకే భారీ బడ్జెట్‌ ఉన్నప్పుడు ఆ సినిమా గురించి ఆలోచిద్దాం'' అన్నారు.

    కమల్ తాజా చిత్రం 'విశ్వరూపం' గురించి చెబుతూ ''వచ్చే నెల 11న విడుదల చేయబోతున్నాం. అంతర్జాతీయ ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. రెండో భాగాన్ని కూడా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాము''ని తెలిపారు. ఇక ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేస్తుందాని ప్రశ్నిస్తే ''వంద కాదు రూ.150 కోట్లు వసూళ్లు సాధించాలని ఆశిస్తున్నాను'' అని ధీమాగా చెప్పారు.

    విశ్వరూపం'లో తీవ్రవాద నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. కమల్ రెండు వైవిధ్య పాత్రల్లో కనిపించనున్నాడు. జనవరి 11న థియేటర్లలోకి రానుంది. అయితే కమల్ ఈ చిత్రాన్ని విడుదల రోజే టీవీ ఛానెల్స్ కు ఇస్తాననటంతో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి నిరసన మొదలైంది. కమల్ కి,డిస్ట్రిబ్యూటర్స్ కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దాదాపు 50 కోట్లకు కమల్ ఈ చిత్రం టెలివిజన్ రైట్స్ ని అదే రోజు టెలీకాస్ట్ చేసుకునే కండీషన్ తో అమ్మేసారు. అయితే టాటా స్కై,ఎయిర్ టెల్ వంటి డిటెహెచ్ ఛానెల్స్ లో మాత్రమే వస్తుంది. థియోటర్స్ ఓనర్స్ స్ట్రైక్ కు పిలుపు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.

    ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ప్రముఖ దర్శకులు శేఖర్‌ కపూర్‌ ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. కథలో ఆ పాత్ర కీలకమై సినిమాను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు.

    ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా పండిట్‌ బిర్జూ మహారాజ్‌ దగ్గర కథక్‌ నృత్యం నేర్చుకొన్నారు. కథలో ఆ నృత్యం కీలకమని సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఇది తెరకెక్కింది. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ స్వరాలు సమకూర్చారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రాహల్ బోస్ ని విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా ఒకే షెడ్యూల్ లో డబ్బై ఐదు రోజులు పాటు అమెరికాలో జరిగింది. హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ చిత్రమే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది. పూజా కుమార్‌, రాహుల్‌ బోస్‌, ఆండ్రియా, జైదీప్‌ అహ్లావత్‌ తదితరులు నటించారు. సంగీతం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌, నిర్మాతలు: ప్రసాద్‌ వి.పొట్లూరి, చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌.

    English summary
    When asked about him teaming up with Rajinikanth again, Kamal Haasan said, "Working with Rajinikanth is a costly question. If both of us starred together, there would be no money to make the film! If we have a lot of money, maybe then we can star in a film together."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X