చెత్తసినిమా అని టాక్... కలెక్షన్స్ సూపర్
చెత్త సినిమా, వరెస్ట్ సినిమా అంటూ కేరళలో ఆ మధ్యన విడుదలైన కృష్ణమ్ .. రాధయమ్ చిత్రానికి టాక్ వచ్చింది. విమర్శకులు ఈ చిత్రాన్ని చీల్చి చెండాడారు. చూసినవాళ్లు సైతం ఇంత చెత్త సినిమా చూపిస్తారా అని కోపంతో రగిలిపోయారు. దాంతో వారంతా ఫేస్ బుక్ ల్లో,యూ ట్యూబ్ ల్లో,తన ప్రెండ్స్ తో ఎక్కడ పడితే అక్కడ ఈ సినిమా గురించి చర్చ మొదలెట్టారు. టీవి ఛానెల్స్ సైతం ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా అన్నట్లు పోగ్రామ్ లు చేసాయి. దాని ఎఫెక్ట్ అద్బుతంగా ఆ సినిమాకి కలిసి వచ్చింది. ఈ సినిమా అనూహ్యంగా హౌస్ ఫుల్స్ అవ్వటం మొదలెట్టంది. జనం పనిగట్టుకుని సినిమాకి వెళ్లి కామెంట్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నారు. దాంతో కేరళ సినీ పరిశ్రమ మొత్తం నివ్వెరపోయింది.
దీనిపై ఓ ప్రేక్షకుడు స్పందిస్తూ... సినిమా ఎలా ఉంది.. క్వాలిటీ ఏంటి .. కథేంటి అని అడక్కండి.. మేము తమాషా చూడటానకి.. థియేటర్ లో జనం చేసే కామెంట్స్ విని నవ్వుకోవటానికి వెళ్లాం. జనం సినిమా చూస్తున్నంతసేపూ కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి హీరో, దర్సకుడు, మ్యూజిక్ డైరక్టర్, లిరిక్ రైటర్, డైలాగు రైటర్ సమస్తం సంతోష్ పండిట్. ఆయన ఈ విజయం చూసి ఆనందంతో సూపర్ స్టార్ సంతోష్ పండిట్ అనే మరో చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయమై సంతోష్ పండిట్ ని మీడియా వారు పలకరిస్తే.. నేనేమన్నా ప్రతీవాడి ఇంటికి వెళ్లి నా సినిమా చూడమని చెప్పానా.. వస్తున్నారు.. చూస్తున్నారు. ఇక ఈ ఇండస్ట్రీలో వాళ్లంటారా.. వాళ్లెవరకీ నా సినిమా ని కామెంట్ చేసే హక్కు లేదు.. ఎందుకంటే వాళ్ళ సినిమాలు భాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్ లు.. నా సినిమా సూపర్ హిట్ అన్నారు. ఇక గూగుల్ లెక్కల ప్రకారం ఇండియా లో ఎక్కువ సెర్చ్ చేయబడ్డ వాళ్ల లిస్ట్ లో సంతోష్ పండిట్ ఒకరు. అంతేగాక ఆన్ లైన్ లో ఎక్కువ మంది చూసిన కేరళ సినిమా ఇదేనట.. ఈ మధ్య కాలంలో.


Click it and Unblock the Notifications











