అసలు నిజం ఇదీ:బడ్జెట్ అంత పెట్టలేకే మహేష్ సినిమా ఆగిపోయింది
చెన్నై: అబ్బబ్బే..అలాంటిదేమీ లేదు..మురగదాస్,మహేష్ సినిమాకు సంభందించిన న్యూస్ కాదు. మణిరత్నం, మహేష్ ల ప్రాజెక్టు అప్పట్లో ప్రారంభం అయ్యే స్దాయి దాకా వచ్చి ఆగిపోయింది. దాని గురించి అప్పట్లో ఎందుకు అలా ఆగిపోయిందో అర్దం కాలేదు. కానీ ఇప్పుడు ఆ స్క్రిప్టుకు స్కీన్ ప్లే రాసిన జయమోహన్ ఆ వివరాలు అందించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొన్నేళ్లక్రితం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన "పొన్నియిన్ సెల్వన్" సినిమా అర్దాంతరంగా పురుట్లోనే ఆగిపోయింది. తెలు సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్, విశాల్ ,అనుష్క శెట్టి లను ప్రధాన పాత్రల్లో తీసుకొని ఈ కథను భారీ ఎత్తున నిర్మించాలని ఆయన భావించారు.

అయితే భారీ అంచనాలు తో మొదలైన ఈ భారీ చిత్రం ప్రీ- ప్రోడక్షన్ దశలోనే ఆగిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆగిపోవడంపై రకరకాల రూమర్స్ వచ్చినప్పటికీ అసలు నిజం మాత్రం బయిటకు రాలేదు. తాజాగా బిహైండ్ ద సీన్ ఏం జరిగిందో...ఆ విషయం చెబుతున్నారు ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం మణిరత్నంతో కలిసి పనిచేసిన రచయిత జయమోహన్.
జయమోహన్ మాట్లాడుతూ.. " ఈ సినిమాని భారీగా మొదలెట్టాలనే అనకున్నారు. స్క్రిప్టు కూడా అద్బుతంగా కుదిరింది. అయితే ఓ సమస్య వచ్చింది. తమిళనాడులో ఎన్నో దేవాలయాలు ఉన్నా కూడా ఏ ఒక్క దేవాలయంలోనూ ఈ సినిమా షూటింగ్ కు అనుమతి లభించలేదు..
దీంతో భారీస్థాయిలో దేవాలయాల సెట్టింగులు వేసి షూటింగ్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.. అప్పటికీ అలా చేయాలని నిర్ణయానికీ వచ్చినా ఈ సెట్టింగ్ ల కోసమే రూ. 50 కోట్లు ఖర్చు అవుతుండటంతో.. అది ఆర్థికంగా సాధ్యం కాదని తేల్చి ప్రీ-ప్రోడక్షన్ దశలోనే సినిమా ఆపేశారు" అని చెప్పారు.


Click it and Unblock the Notifications











