twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ ‘కాలా’ ఫస్ట్ పాట వచ్చేసింది, చెత్తగా ఉందంటూ నెగెటివ్ కామెంట్స్!

    By Bojja Kumar
    |

    రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం 'కాలా'. జూన్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మే డేను పురస్కరించుకుని ఈ చిత్రం ప్రమోషన్లు ప్రారంభించారు. ఇందులో భాగంగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కంపోజ్ చేసిన మొదటి పాటను విడుదల చేశారు. తమిళం, తెలుగు, హిందీ వెర్షన్లలో ఈ పాటను విడుదల చేశారు. అయితే ఈ పాట విన్న రజనీకాంత్ అభిమానులు ఇదేం పాట? అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట ట్యూన్స్ ఏ మాత్రం ఆకట్టుకోలేని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

    కాలా ఫస్ట్ సింగిల్ ఇదే

    తెలుగులో యమ గ్రేటు అంటూ సాగే లిరిక్స్‌తో మొదటి పాటను విడుదల చేశారు. ‘భయము ఎరుగని... వన్నె తరగని... ఎంత ఎదిగినా... ఒదిగిన వాడు' అంటూ ఈ పాట సాహిత్యం సాగింది. తెలుగు వెర్షన్‌కు ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించారు. లిరిక్స్ బావున్నాయి, కానీ కంపోజ్ చేసిన విధానమే బాగోలేదని అంటున్నారు.

    ట్యూన్స్ నచ్చలేదంటూ విమర్శలు

    నేను సూపర్ స్టార్ రజనీకి పెద్ద అభిమాని. ఫస్ట్ సింగిల్ అనగానే ఆసక్తిగా ఎదురు చూశాం. కానీ ఈ పాట మళ్లీ వినాలనిపించడం లేదు.... అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు.

    మిగతా పాటలైనా బావుండాలి

    ‘కాలా' తొలి సాంగ్ ఏ మాత్రం నచ్చలేదు. ఆల్బంలోని మిగతా పాటలైనా బావుంటాయని ఆశిస్తున్నాను అంటూ మరో అభిమాని ట్వీట్ చేశారు

    ఇలాంటి పాట ఎక్స్‌పెక్ట్ చేయలేదు

    సంతోష్ నారాయణ్ నుండి ఇలాంటి పాట అస్సలు ఊహించలేదని మరో కామెంట్. ఇలా ‘కాలా' తొలి పాటను విమర్శిస్తూ చాలా కామెంట్స్ వచ్చాయి.

    మే 9న ఆడియో వేడుక

    మే 9న ఆడియో వేడుక

    కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో మే 9న చెన్నైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఈ వెంటుగా దీన్ని నిర్వహించబోతున్నారు. సౌతిండియాకు చెందిన ఓ పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

     ‘కాలా’పై భారీ అంచనాలు

    ‘కాలా’పై భారీ అంచనాలు

    పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈచిత్రం థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసింది. ముంబై బ్యాక్ డ్రాప్‌తో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో పా రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రం భారీ విజయం సాధించడంతో ‘కాలా'పై భారీ అంచనాలున్నాయి.

    రిలీజ్ ముందే లాభాలు

    రిలీజ్ ముందే లాభాలు

    'కాలా' చిత్రాన్ని దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రజనీకాంత్ సినిమా కావడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. దాదాపు రూ. 125 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. దీంతో పాటు శాటిలైట్ రైట్స్ రూపంలో రూ. 75 కోట్లు అదనంగా వచ్చాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన రజనీకాంత్ అల్లుడు ధనుష్ రూ. 125 కోట్ల లాభాన్నీ సినిమా రిలీజ్ ముందే ఆర్జించినట్లు టాక్.

    English summary
    The first single from Kaala is out online. The makers unveiled the songs from the three versions – Tamil, Telugu, and Hindi – on Tuesday, May 1.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X