ఆడియో విడుదలకు ముస్తాబైన నయనతార, విజయ్‌ల యమకంత్రి
దేవి శ్రీ ప్రసాద్ సంగీతసారధ్యంలో రూపొందిన 'యమకంత్రి' సినిమా పాటలు ఈ నల 31న 'కోయల్ మ్యూజిక్' ద్వారా విడుదల కానున్నాయి. చంద్రబోస్, భువనచంద్ర, సాహితి ఈ చిత్రానికి సాహిత్యాన్ని సమకూర్చారు. జి.డి.ఆర్ మీడియా లిమిటెడ్ పతాకంపై జి.ఉషారాణి నిర్మిస్తున్న 'యమకంత్రి' చిత్రాన్ని జే.పి.ఫిలిమ్స్ సమర్పిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. విజయ్, ప్రకాష్ రాజ్, వడివేలు, ఖుష్బు, జ్యోతి, రంజిత, గీత, ముమైత్ ఖాన్ ఇతర ముఖ్య తారాగణం.
ఆడియో విడుదల సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత జి.ఉషారాణి మాట్లాడుతూ 'ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అందుకు తగ్గట్లుగా చంద్రబోస్, భువనచంద్ర, సాహితి చక్కని సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ నెల 31న 'కోయల్ మ్యూజిక్' ద్వారా పాటలు విడుదల చేసి, ఫిబ్రవరి ద్వితీయార్ధం లో సినిమా విడుదల చేస్తున్నాం. ప్రభుదేవా దర్శకత్వం, నయనతార అందం, అభినయం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ముఖ్య ఆకర్షణలుగా రూపొందిన 'యమకంత్రి' అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుంది' అన్నారు.


Click it and Unblock the Notifications











