మద్యం మత్తులో కారుతో గుద్దేసి హీరోయిన్ పరారీ.. చావుబతుకుల్లో స్విగ్గీ బాయ్‌!

బిగ్‌బాస్, తమిళ సినిమాలతో యూత్ అభిమానులను దక్కించుకొన్న హీరోయిన్ యషికా ఆనంద్ తాజాగా వివాదంలో కూరుకుపోయింది. నడిరోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఓ యువకుడు చావు బతుకుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన చెన్నైలోని ప్రధాన ప్రాంతంలో చోటుచేసుకొన్నది. ప్రమాదం జరిగిన వెంటనే హీరోయిన్ యషికా అక్కడి నుంచి పరార్ కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

యషికా ప్రయాణిస్తున్న వాహనం

యషికా ప్రయాణిస్తున్న వాహనం

యాక్టర్ యషికా ప్రయాణిస్తున్న కారు స్విగ్గీ డెలివరీ బాయ్‌ని ఢీకొట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. భరత్ అనే డెలీవరీ బాయ్‌ ఓ రోడ్డుపైన ఓ పక్కకు ఉంటే వేగంతో దూసుకొచ్చిన హీరోయిన్ కారు బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. అంతేకాకుండా పేవ్‌మెంట్‌పై ఉన్న షాపు కూడా పాక్షికంగా ధ్వంసం అయినట్టు తెలిసింది. ఈ ఘటనపై నుంగబాక్కమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

డ్రైవర్ అదుపు కోల్పోవడంతో

డ్రైవర్ అదుపు కోల్పోవడంతో

పోలీసుల కథనం ప్రకారం.. యషికా ఆనంద్ తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నది. కారుపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతో వేగంగా పేవ్‌మెంట్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో భరత్ అనే స్విగ్గీ బాయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు అని పోలీస్ అధికారి తెలిపారు.

సంఘటనా స్థలం నుంచి పరార్

సంఘటనా స్థలం నుంచి పరార్

కారు ఢీకొట్టడంతో గాయపడిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ని పట్టించుకోకుండా యషికా ప్రవర్తించడం వివాదంగా మారింది. గాయపడిన భరత్‌ను వదిలేసి సంఘటనా స్థలం నుంచి క్యాబ్‌ బుక్ చేసుకొని ఆమె వెళ్లిపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కారు ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సీటులో ఎవరున్నారనే విషయంపై పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యమత్తులో హీరోయిన్, డ్రైవర్

మద్యమత్తులో హీరోయిన్, డ్రైవర్

హీరోయిన్ కారు ప్రమాదం ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వస్తన్నాయి. యాక్సిడెంట్ జరిగిన సమయంలో డ్రైవర్, హీరోయిన్ యషికా, ఆమె స్నేహితులు ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ ఘటనపై పోలీసులు ద‌‌ృష్టిపెట్టారు. వాహనం ప్రయాణిస్తున్న వారు ఆల్కాహల్ తీసుకొన్నారా? లేదా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

యషికా కెరీర్ గురించి

యషికా కెరీర్ గురించి

ఇక యషికా విషయానికి వస్తే.. ఇరుట్టు ఆరైయిల్ మురట్టు కుట్టు, జోంబీ చిత్రాల్లో నటనకు మంచి ప్రేక్షకదారణ లభించింది. అందం, అభినయం కాకుండా యషిక మంచి మాటకారి అనే పేరుంది. గత బిగ్‌బాస్‌ షోలో కమల్ హాసన్ ప్రశంసలు అందుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X