ప్రముఖ నిర్మాత కుమారుడితో హీరోయిన్ డేటింగ్.. ముద్దు పెట్టే వీడియోతో హల్‌చల్

దక్షిణాది సినీ తార యషికా ఆనంద్ హాట్ హాట్‌గా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ నిర్మాత కుమారుడితో డేటింగ్ చేస్తున్నారనే వార్త ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియుడితో కలిసి సన్నిహితంగా ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కావడంతో వీరద్దరి డేటింగ్‌కు ఆధారాలు దొరికినట్లు అయింది. ఇంతకు యషికా ఆనంద్ ప్రియుడు ఎవరంటే..

పలు రకాల వివాదాలతో మీడియాలో

పలు రకాల వివాదాలతో మీడియాలో

తమిళ చిత్ర పరిశ్రమలోకి 2016లోనే ప్రవేశించిన యషికా ఆనంద్.. 2018లో తమిళ బిగ్‌బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ కావడంతో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత మీటూ క్యాంపెయిన్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ డైరెక్టర్‌పై ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ప్రస్తుతం నిర్మాత కొడుకుతో ప్రేమాయణం జరుపుతున్నారనే విషయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

బిగ్‌బాస్‌లో అఫైర్ వార్తలతో

బిగ్‌బాస్‌లో అఫైర్ వార్తలతో

బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు యాక్టర్ మహత్‌ను ప్రేమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే వారిద్దరి బంధం కేవలం బిగ్‌బాస్ వరకే పరిమితమైంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మహత్‌తో ఎక్కువ కాలం రిలేషన్‌ను కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత నిర్మాత కుమారుడితో రిలేషన్ గట్టిపడిందనే వార్తలు వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం తమిళ చిత్ర నిర్మాతతో

ప్రస్తుతం తమిళ చిత్ర నిర్మాతతో

తమిళ నిర్మాత, జాతీయ అవార్డు గ్రహీత థంబి రామయ్య కుమారుడు ఉమాపతితో యషికా ఆనంద్ కొంత కాలంగా అతి చనువుగా ఉంటున్నది. వారిద్దరు కలిసి మణియార్ కుటుంబం అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వారి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే డేటింగ్ వార్తలపై యషికా ఖండించకపోవడంతో అనుమానాలు బలంగా మారాయి.

ముద్దు వీడియోతో హల్‌చల్

ముద్దు వీడియోతో హల్‌చల్

ఇటీవల యషికా ఆనంద్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో సంచలనం రేపింది. ఓ వ్యక్తిని ముద్దు పెట్టుకొంటున్న వీడియోను షేర్ చేయడంతో అఫైర్ కొనసాగిస్తున్నట్టు వార్తలకు బలం చేకూర్చాయి. ఈ వీడియోలో మరో అందాల తార ఐశ్వర్య దత్తా కూడా ఉండటం గమనార్హం.

Recommended Video

వర్జీనిటీపై హీరోయిన్ సంచలన కామెంట్స్
యషికా ఆనంద్ కెరీర్

యషికా ఆనంద్ కెరీర్

2016 నుంచి ఇప్పటి వరకు డజన్‌కుపైగా చిత్రాల్లో నటించిన యషికా ఆనంద్ ప్రస్తుతం రెండు మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహత్ హీరోగా వస్తున్న చిత్రం థాన్ ఉత్తమన్ చిత్రంలో హీరోయిన్‌గా, అలాగే ఆరవ్ నటించే రాజా భీమ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X