యువ హీరోయిన్‌కు అరెస్ట్ వారెంట్స్.. 25వ తేదీన కోర్టుకు రాకపోతే అంటూ వార్నింగ్!
విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు, తమిళంలో పలు చిత్రాల్లో గ్లామర్ పాత్రలతో ఆకట్టుకొన్న యషికా ఆనంద్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితుల్లో పడ్డారు. ఏదో విషయంపై నిత్యం అనేక వార్తల్లో ఉండే ఈ అందాల సుందరి లీగల్ చిక్కుల్లో ఇరుక్కుపోయారు. రోడ్డు ప్రమాదం కేసులో అందాల భామకు పోలీసులు అరెస్ట్ వారెంట్స్ జారీ చేయడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. యషికా ఆనంద్‌కు ఎదురైన న్యాయపరమైన సమస్య ఏమిటంటే?

దారుణంగా కారు యాక్సిడెంట్
యషికా ఆనంద్ తన స్నేహితులతో కలిసి జూన్ 24వ తేదీ, 2021 సంవత్సరంలో కారులో చెన్నై నుంచి మహబలిపురంకు ప్రయాణించింది. ఆ కారులో స్నేహితురాలు భవానీ వలిశెట్టి, మరో ఇద్దరు స్నేహితులు ప్రయాణిస్తు ఉన్నారు. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు యాక్సిడెంట్ ఘటనలో భవానీ అక్కడికక్కడే మరణించగా.. అందరూ తీవ్రంగా గాయపడ్డారు.

యషికాపై మూడు కేసులు
కారు యాక్సిండెంట్ తర్వాత యషికా ఆనంద్ చాలా నెలలు హాస్పిటల్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో ట్రీట్‌మెంట్ తీసుకొని కోలుకొన్నది. ఈ రోడ్డు ప్రమాదం కేసులో ఆమెపై పోలీసులు సెక్షన్ 304 ఏ కింద మూడు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో
అయితే చెన్నై, మహబలిపురంకు మధ్య జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం కేసులో కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు, చెంగల్పట్టు కోర్టు సీరియస్ అయ్యారు. మార్చి 21న హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆమె కోర్టుకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ వారెంట్స్ జారీ చేశారు.

మార్చి 25న హాజరు కావాలి అంటూ
యషికా ఆనంద్‌కు చెంగల్పట్టు కోర్టు మార్చి 23న అరెస్ట్ వారెంట్స్ జారీ చేశారు. ఏప్రిల్ 25వ తేదీన కోర్టుకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని వారెంట్స్‌లో పేర్కొన్నారు. దాంతో ఈ కేసు యషికాను చిక్కుల్లో పడేసింది. అరెస్ట్ వారెంట్ల నేపథ్యంలో యషికా ఫ్యామిలీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

యషికా ఆనంద్ కెరీర్ ఇలా..
యషికా ఆనంద్ కెరీర్ విషయానికి వస్తే.. 2023లో భగీరథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన తమిళ చిత్రాలు రాజా భీమ, పామ్ భట్టం, సల్ఫర్, సిరుతాయ్ శివ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











