ఆఫర్ ఇస్తా.. కోరిక తీర్చుతావా.. నాపై ప్రముఖ దర్శకుడి వేధింపులు.. నవాబ్ హీరోయిన్

తమిళ నటి యషిక ఆనంద్ తాజా లైంగిక ఆరోపణలతో కోలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఆఫర్ ఇస్తానని చెప్పి ప్రముఖ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని యషిక ఆరోపణలు చేయడం సంచలనం రేపుతున్నది. ఇటీవల విడుదలైన నవాబ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన యషిక తాజా ఆరోపణలు చేయడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇంతకు యషిక ఎవరు? ఆమె చేసిన ఆరోపణలు ఏమిటంటే..

నాతో ప్రముఖ దర్శకుడు

నాతో ప్రముఖ దర్శకుడు

బిగ్‌బాస్ తమిళం 2 ద్వారా యషిక ఆనంద్ దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత తమిళ సినిమాల్లో బిజీగా మారారు. మణిరత్నం దర్శకత్వం వహించిన నవాబు చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. కెరీర్ గాడిన పడిందనుకొంటున్న నేపథ్యంలో యషిక ఆనంద్ లైంగిక దాడి చేశారని ప్రముఖ దర్శకుడిపై ఆరోపణలు చేయడంతో సినీ వర్గాలు ఉలిక్కిపడ్డారు.

మీ టూ కారణంగా

మీ టూ కారణంగా

మీ టూ ఉద్యమం జోరందుకొన్న నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడానికి సాహసం చేస్తున్నాను అని యషిక చెప్పింది. అయితే తనను వేధించిన ప్రముఖ దర్శకుడు ఎవరో చెప్పకపోవడం ఈ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌గా మారింది.

ప్రముఖ హీరోకు గాడ్ ఫాదర్‌గా

ప్రముఖ హీరోకు గాడ్ ఫాదర్‌గా

ఇటీవల చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. ఓ ప్రముఖ దర్శకుడి నుంచి కాల్ వచ్చింది. ఆయన ఓ పాపులర్ హీరోకు గాడ్‌ఫాదర్ లాంటి వాడు. ఓ సినిమాలోని ఓ పాత్ర కోసం ఆడిషన్ నిర్వహిస్తున్నాం. అందు కోసం కలవమని చెప్పారు అని యషిక వెల్లడించారు.

 ఆఫర్ ఇస్తా.. కానీ కోరిక

ఆఫర్ ఇస్తా.. కానీ కోరిక

ఆడిషన్ కోసం నా తల్లితో కలిసి వెళ్లాను. రూంలోకి వెళ్లిన తర్వాత నా తల్లిని అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత నా సినిమాలో ఆఫర్ ఇస్తాను. కానీ నా కోరిక తీర్చాలి అనే షరతు పెట్టారు. దాంతో నాకు దిమ్మతిరిగినంత పనైంది అని యషిక తెలిపారు. అప్పట్లో ఆ విషయాన్ని మీడియాకు చెప్పే ధైర్యం లేకపోయింది. ప్రస్తుతం మీటూ ఉద్యమం నాకు ధైర్యాన్ని కూడగట్టేలా చేసిందన్నారు.

పని కోసం మనసు చంపుకోవాలా?

పని కోసం మనసు చంపుకోవాలా?

ఇంత పాపులారిటి ఉన్న ఇండస్ట్రీలో స్టార్‌గా మారడానికి మనసు చంపుకోవాలా? పని కోసం నేను ఒకరికి లైంగికంగా లొంగిపోవాలా? ఆ సమయంలో నాలాంటి వాళ్లకు ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితి. మీ టూ ఉద్యమంతో అన్యాయానికి గురవుతున్న మహిళలకు ఓ వేదిక దొరికింది అని యషిక పేర్కొన్నది.

అర్జున్, వైరముత్తుపై ఆరోపణలు

అర్జున్, వైరముత్తుపై ఆరోపణలు

మీ టూ ఉద్యమం జోరందుకోవడంతో సినీ పరిశ్రమలోని తారలందరూ తమకు జరిగిన అన్యాయంపై పెదవి విప్పుతున్నారు. అమలాపాల్; లీనా మణిమేకలై, చిన్మయి. శృతిహరిహరన్, తాజాగా యషిక సంచలన ఆరోపణలు చేశారు. అర్జున్, వైరముత్తు, సుసీ గణేషన్‌పై వీరందరూ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X