twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాక్సిడెంట్ గురించి నోరు విప్పిన యషికా.. ఆమె అందుకే చనిపోయింది, అసలు ఏమైందంటే?

    |

    నటి యషికా ఆనంద్ ఇరవై నాలుగో తేదీ రాత్రి చెంగల్పట్టు జిల్లాలోని మామల్లపురం ప్రాంతంలో ప్రమాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్నేహితురాలు భవానీ, అమీర్, సయ్యద్‌తో కలిసి పార్టీకి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ జరగగా తాజాగా అది ఎలా జరిగింది అనే విషయాన్ని వెల్లడించింది యషికా ఆనంద్.

    చెన్నైలో ప్రమాదం

    చెన్నైలో ప్రమాదం

    యషికా తన స్నేహితులతో పాండిచ్చేరి నుంచి చెన్నైకి చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ మీదుగా ప్రయాణించే క్రమంలో కారును స్వయంగా నడిపింది. కారు అదుపుతప్పి రోడ్డు మధ్య ఉన్న డివైడర్ ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో నటి స్నేహితురాలు భవానీ అక్కడికక్కడే మరణించింది. మమల్లాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రక్షించి పూంచేరిలోని ప్రమాద ప్రథమ చికిత్స కేంద్రానికి పంపారు.

    RajKundra కేసులోకి మనోజ్ బాజ్ పేయిని లాగిన కమెడియన్.. గదిలో బంధించి 100 రోజులు కొట్టాలంటూ!RajKundra కేసులోకి మనోజ్ బాజ్ పేయిని లాగిన కమెడియన్.. గదిలో బంధించి 100 రోజులు కొట్టాలంటూ!

    పరిస్థితి విషమంగానే

    పరిస్థితి విషమంగానే


    ఇక తదుపరి చికిత్స కోసం యషికాను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.నటి యషికాకు తుంటి, కాలు ఎముకలు విరిగి పోయినందున ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మహాబలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక తాజాగా మహాబలిపురం పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి యషికా నుండి స్టేట్మెంట్ తీసుకున్నారు.

    కీలక వివరాలు వెల్లడించిన యషికా

    కీలక వివరాలు వెల్లడించిన యషికా


    ఈ సమయంలో ఆమె పలు కీలక వివరాలు వెల్లడించిందని అంటున్నారు. తానే కారు నడుపుతున్నానని ఒప్పుకున్నా ఆమె వేగంగా వెళుతుండగా తన కారు పై నియంత్రణ కోల్పోయి కారును ఢీ కొట్టానని పేర్కొన్నారు. ఇక ఆ సమయంలో ఆమె మద్యం ప్రభావంతో లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.

    RajKundra caseలో శిల్పని వదలని పోలీసులు.. ఫోన్ మీద ఫోకస్, కీలక వివరాలు సేకరించిన క్రైంబ్రాంచ్!RajKundra caseలో శిల్పని వదలని పోలీసులు.. ఫోన్ మీద ఫోకస్, కీలక వివరాలు సేకరించిన క్రైంబ్రాంచ్!

    సీట్ బెల్ట్ లేకపోవడం వలనే

    సీట్ బెల్ట్ లేకపోవడం వలనే


    కారు ఢీకొన్న సమయంలో వల్లిశెట్టి భవాని సీట్ బెల్ట్ ధరించకపోవడంతో కారులో నుంచి విసిరి వేయబడి చనిపోయిందని పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో యషికా తన కారును గంటకు 120 కి.మీ వేగంతో నడుపుతుండటం గమనార్హం. అతివేగంగా నడుపుతుండటం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

    లైసెన్స్ జప్తు

    లైసెన్స్ జప్తు


    యశికా ఆనంద్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదైనందున, కేసు ముగిసే వరకు ఆమె వాహనాలు నడపకూడదనే ఉద్దేశంతో మహబలిపురం పోలీసులు యశికా డ్రైవింగ్ లైసెన్స్‌ను జప్తు చేశారు. ఇక డోంట్ వర్రీ చిత్రంతో తెరంగేట్రం చేసిన నటి యషిక బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయ్యింది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ, యశిక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో చురుకుగా ఉంటుంది.

    English summary
    Yashika Aannand is in a conscious state and the police have recorded her statement. According to the statement, Yashika revealed crucial information.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X