twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోయినా పర్వాలేదంట: వర్జీనిటీపై హీరోయిన్ సంచలన కామెంట్స్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    వర్జీనిటీపై హీరోయిన్ సంచలన కామెంట్స్

    సెక్స్, వర్జినిటీ లాంటి అంశాల గురించి సినీ సెలబ్రిటీల పలు ఇంటర్వ్యూల్లో బోల్డ్‌గా మాట్లాడటం తరచూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ కోవలో మరో హీరోయిన్ చేరింది. 'ఇరుట్టు అరయిల్ మురట్టు కుతు' అనే తమిళ సినిమాలో నటించిన హీరోయిన్ యశిక ఆనంద్ వర్జీనిటీ మీద చేసిన కామెంట్స్ తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. కెరీర్ ప్రారంభ దశలో ఉన్న ఈ బ్యూటీ పబ్లిసిటీ కోసమే బోల్డ్ కామెంట్స్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

     అడల్డ్ మూవీలో నటించిన యశిక

    అడల్డ్ మూవీలో నటించిన యశిక

    ‘ఇరుట్టు అరయిల్ మురట్టు కుతు' అనే తమిళ అడల్డ్ కామెడీ చిత్రంలో యశిక నటించింది. అసలు ఈ సినిమా స్టోరీనే విచిత్రంగా ఉంది. వర్జినిటీ కోల్పోవాలనే తన కోరిక పోకుండానే చనిపోయిన ఒక అమ్మాయి దెయ్యంగా మారిన తర్వాత వర్జినిటీ కోల్పోవడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా అసలు కథ.

    పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోవడంపై యశిక

    పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోవడంపై యశిక

    సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యశికకు పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోవడంపై ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.... ‘చాలా మంది అబ్బాయి పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోతున్నారు. అలాంటపుడు అమ్మాయిలు వర్జీనిటీ కోల్పోతే తప్పేంటి? అంటూ యశిక వ్యాఖ్యానించారు.

    పోర్న్ సినిమాలు చూస్తూ ఇంట్లో దొరికిపోయిన యశిక

    పోర్న్ సినిమాలు చూస్తూ ఇంట్లో దొరికిపోయిన యశిక

    వర్జినిటీ అంశంతో ఆగని యశిక.... తన ఫస్ట్ పోర్న్ మూవీ వాచింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి కూడా వెల్లడించింది. పోర్న్ సినిమాల గురించి సెర్చ్ చేస్తుండగా ఇంట్లో దొరికిపోయానని వెల్లడించారు. ఇలాంటి అంశాల గురించి యశిక ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.

     తెలుగులో నటించబోతున్న యశిక

    తెలుగులో నటించబోతున్న యశిక

    తమిళ మూవీ ‘కావలై వేండమ్' ద్వారా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన యశిక.... తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘నోటా' చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించబోతోంది.

    English summary
    Tamil Actress Yashika Anand recently made bold comments in interview and it has become a hot topic now. When Yaashika was asked about losing virginity in the interview she said: "It's ok to lose for girls to lose virginity before marriage just like how boys lose their virginity."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X