2019: డబుల్ సెంచరీ కొట్టేసిన చిత్రసీమ.. ఆ హీరోనే టాప్ ప్లేస్
ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది (2019) కూడా వెండితెరపై సినిమాల జోష్ కనిపించింది. టాలీవుడ్ సహా కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎన్నో సినిమాలు విడుదలై ప్రేక్షక లోకాన్ని అలరించాయి. అలా 2019 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2020 సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు రెడీ అయింది చిత్రసీమ. అయితే ఈ ఏడాదికి గాను తమిళ సినీ పరిశ్రమ కోలీవుడ్‌లో ఓ ప్రత్యేకత సంతరించుకుంది.
కొన్నేళ్లుగా ఒకే సంవత్సరంలో డబుల్ సెంచరీ సినిమాలకు అటు ఇటుగా కొనసాగుతున్న కోలీవుడ్ చిత్రసీమ.. ఈ ఏడాది (2019) లోనూ డబుల్ సెంచురీ దాటేసింది. విజయాలు, అపజయాల సంగతి అటుంచితే ఈ ఏడాది కోలీవుడ్ నుంచి ఏకంగా 205 సినిమాలు విడుదలయ్యాయి.

ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్ 'పేట్ట', అజిత్ 'విశ్వాసం' విజయాలతో పాటు.. 'బిగిల్', 'నేర్‌కొండ పార్వై', 'కాంచన3', 'ఖైదీ' చిత్రాలు 100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి వార్తల్లో నిలిచాయి. రెండు విజయాలతో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ టాప్ స్టార్‌గా నిలిచారు.
అయితే అత్యధిక చిత్రాల్లో నటించిన స్టార్‌హీరోగా విజయ్ సేతుపతి (4) నిలిచాడు. ఇక ఆ తర్వాత కార్తీ, శివకార్తికేయన్ మూడేసి సినిమాల్లో నటించి రెండోస్థానంలో నిలిచారు. అయితే 2019లో తమిళ సినిమా ఎన్నో మెరుపులు మెరిపించినా, విజయాలు మాత్రం అంతంత మాత్రంగానే కనిపించాయి. చూడాలి మరి ఇక 2020 సంవత్సరంలో తమిళ చిత్రసీమ అలాంటి విజయాలు దక్కించుకోనుందో!.


Click it and Unblock the Notifications











