సమంత 'ఎటో వెళ్ళి పోయింది మనస్సు' ఆడియో??
ఏ మాయ చేసావే చిత్రంలో తనకంటూ తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన తన తాజా చిత్రం 'ఎటో వెళ్ళి పోయింది మనస్సు' నాని,సమంత కాంబినేషన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో మే నెలాఖరుకు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఖచ్చితంగా ఫలానా రోజు అని ఇంకా ఫిక్స్ చేయలేదు. అలాగే చిత్రాన్ని జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పాటలు విడుదలైన రెండు వారాల్లోపే సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రెండు బిట్ సాంగ్స్ తో కలిపి తొమ్మిది పాటలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంత శ్రీరాం ఈ పాటలనన్నిటినీ సింగిల్ కార్డుతో రాసారు. ఈ చిత్రం ప్రోమో ఇప్పటికే రిలీజయ్య ఇళయారాజా అభిమానుల్లో ఆసక్తిని రేపింది. గ్యారెంటీగా మ్యూజికల్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. నాని,సమంతలు సైతం ఈ చిత్రంపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. సమంత ఈ చిత్రంలో తనకు డిఫెరెంట్ పాత్ర అని...టీనేజ్ అమ్మాయిగా,పెళ్లైన యువతిగా డిఫెరెంట్ గా ఒకే పాత్రలో కనిపిస్తున్నాని చెప్తోంది.
సమంత ఈ చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ..''నా అభిమాన దర్శకుడు రూపొందిస్తున్న 'ఎటో వెళ్లి పోయింది మనస్సు' చిత్రంలో హీరోయిన్‌గా నటించటమనేది ఈ సంవత్సరంలో నాకు వచ్చిన అపురూపమైన అవకాశంగా భావిస్తున్నా.. ఆ సినిమాలో కాలేజీ అమ్మాయిగా నటిస్తున్నా. ఒక అబ్బాయి, అమ్మాయిల నడుమ చోటు చేసుకున్న సంఘటన సమాహారంగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాక మూడు భాషల్లో హీరోయిన్‌గా నేనే నటిస్తున్నా'' అని వివరించింది.
ఇక ఎటో వెళ్లి పోయింది టైటిల్.. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నా పెళ్ళాడతా చిత్రంలో హిట్టైన సాంగ్ లోది. అలాగే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. తమిళంలో హీరోగా జీవా నటిస్తున్నారు. హిందీలో ఆదిత్యా రాయ్ కపూర్ చేస్తూండగా నాని తెలుగులో చేస్తున్నారు. మొదట రామ్ ని తెలుగుకు అనుకున్నారు కానీ అభిప్రాయ భేధాలతో రామ్ ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చేసారు. సమంత మాత్రం ఈ భాషల్లోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని దర్సకుడు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











