twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమెడియన్ యోగిబాబు ‘పెళ్లి’ క్యాన్సిల్.. ఆ రోజున ఏం చేశారో తెలిస్తే షాకే!

    |

    కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ స్తంభించడంతో రోజువారీ వేతన కార్మికులు జీవితాలు కష్టాల్లో పడ్డాయి. దాంతో సినీ నటులు ముందుకొచ్చి తమ వంతు సామాజిక బాధ్యతగా చేయూతనిస్తున్నారు. తమిళ పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా పేరొందిన యోగిబాబు చూపించిన కరుణ ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది.

    కొవిడ్ 19 కారణంగా ఆకలితో అలమిటిస్తున్న సినీ కార్మికులకు యోగిబాబు అండగా నిలిచారు. సినీ పరిశ్రమ యూనియన్‌తోపాటు సహకారం అందిస్తున్న ఈ నటుడు.. వ్యక్తిగతంగా కూడా సహాయ చర్యల్లో భాగమయ్యారు. తన వంతు బాధ్యతగా యోగిబాబు 1250 బస్తాల బియ్యాన్ని పేద సినీ కార్మికులకు అందించారు.

     Yogi Babu distributed 1250 bags of rice to amid Coronaviurs

    స్వయంగా తన తోటి కళాకారులను ఆహ్వానించి యోగిబాబు తన వంతు సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ గణశేఖర్ కూడా భాగమయ్యారు. సినీ కార్మికుల్లో వయోవృద్ధులకు సాయం చేయడంపై యోగిబాబుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

    వాస్తవానికి ఏప్రిల్ 9వ తేదీన యోగిబాబు పెళ్లి రిసెప్ఫన్‌కు ఏర్పాట్లు చేశారు. తమిళనాడు సీఎంతోపాటు సినీ, రాజకీయ పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు. అయితే కరోనా కారణంగా తన పెళ్లి వాయిదా పడటంతో అదే రోజున కరోనా కారణంగా బాధపడుతున్న పేద సినీ కార్మికులకు అండగా నిలువడం అందరి ప్రశంసలకు కారణమైంది.

    English summary
    Actor Yogi Babu distributed 1250 bags of rice to amid Coronaviurs. Infact, His marriage reception planned on April 9th, but it cancelled due to lockdown. On that he helped underprivileged actors and actresses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X