హీరోలకు షాక్.. కమెడియన్‌తో జతకడుతున్న నయనతార
సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్ నయనతార సొంత ఇమేజ్‌తోనే బాక్సాఫీస్ వద్ద కాసుల పంటపండిస్తున్నారు. ఇక హీరోల పక్కన నటించి తన అస్థిత్వాన్ని నిలుపుకొనే ప్రయత్నాలను ఎప్పుడో మానేసింది. తాజాగా మళ్లీ యోగిబాబు లాంటి కమెడియన్‌తో జతకట్టేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కలిసి నటించిన కొలమావు కోకిల చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళ మీడియా రిపోర్టుల ప్రకారం.. యోగిబాబు స్వయంగా రాసిన స్క్రిప్టుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆమె కథ పాయింట్ నచ్చడంతో ఆయనతో నటించడానికి ఒప్పుకొన్నారనే వార్తలు వస్తున్నాయి.

నయనతార అంగీకారం మేరకు 18 రీల్స్ ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన ఎస్పీ చౌదరీ సినిమాను రూపొందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో యోగిబాబు కూడా ఓ కీలకపాత్రలో నటిస్తారు. ఈ సినిమాకు ఓ యువ డైరెక్టర్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
యోగిబాబు ఇటీవలే ధనుష్ మూవీ కర్ణన్, కాక్‌టైల్ చిత్రాల్లో నటించారు. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఈ సినిమాల రిలీజ్ వాయిదా పడింది. ఇక యోగిబాబు వివాహం మంజు భార్గవితో తిరుత్తాని ఆలయంలో ఫిబ్రవరి 5న జరిగిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో పెద్దలకు రిసెప్షన్‌కు ఆహ్వానించగా, కరోనావైరస్ కారణంగా వాయిదా పడింది.
ఇక నయనతార విషయానికి వస్తే నేత్రికన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తన ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మాత. కొరియన్ ఫిల్మ్ బ్లైండ్ అనే సినిమాకు ఇది స్ఫూర్తి. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్నది.


Click it and Unblock the Notifications











