twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరిద్దరూ సైకోలు.. డిటెక్టివ్‌కు ఫైనాన్స్ చేయం.. విశాల్‌కు షాకిచ్చిన బ్యాంకర్లు (ఇంటర్వ్యూ)

    మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డిటెక్టివ్‌'.

    By Rajababu
    |

    Recommended Video

    Vishal's "Detective" Releases On November 10 విశాల్‌కు షాకిచ్చిన బ్యాంకర్లు

    మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డిటెక్టివ్‌'. ఈ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో విశాల్‌, హీరోయిన్‌ ఆండ్రియా, నిర్మాత హరి, మాటల రచయిత రాజేష్‌ ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

    తుప్పరివాలన్ ఘన విజయం

    తుప్పరివాలన్ ఘన విజయం

    మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''మంచి థ్రిల్లర్‌, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. నాకు నటుడిగా మంచి పేరు, నిర్మాతగా మంచి కలెక్షన్స్‌ సాధించి పెట్టిన చిత్రమిది. అక్టోబర్‌ నెలలో తమిళంలో 'తుప్పరివాలన్‌' పేరుతో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తెలుగులో కూడా విడుదల అవుతున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు మిస్కిన్‌గారి గురించి ప్రత్యేంగా ప్రస్తావించాలి.. ఆయనొక విభిన్నమైన వ్యక్తి. ఈ సినిమాకు ఫైట్స్‌ను ఆయనే కంపోజ్‌ చేసుకున్నాడు అన్నారు.

     మిస్కిన్‌కు ఫ్యాన్స్

    మిస్కిన్‌కు ఫ్యాన్స్

    సాధారణంగా ఓ హీరోకు అభిమానులుంటారు. సదరు హీరో సినిమా రిలీజ్‌ అవుతుందంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ వస్తాయి. కానీ దర్శకుడు మిస్కిన్‌ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులుంటారు. అలాంటి ఓ దర్శకుడితో సినిమా చేస్తే, నాకు గుర్తుండిపోయే చిత్రమవుతుందనిపించింది.

     ఇద్దరూ సైకోలే

    ఇద్దరూ సైకోలే

    మిస్కిన్‌తో సినిమా ప్రారంభించినప్పుడు తమిళ సినిమా పరిశ్రమలో అందరూ చర్చించుకొన్నారు. ఇద్దరు సైకోలు కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ముందుకెళ్తుందా అనే అనుమానాలను వ్యక్తం చేశారు. సాధారణంగా సినిమా చేసేటప్పుడు దాని కోసం ఫైనాన్స్ తీసుకొంటాం. ఫైనాన్స్ కోసం బ్యాంకులను, ఇతరులను సంప్రదించాం.

     సినిమా పూర్తవుతుందా?

    సినిమా పూర్తవుతుందా?

    అయితే మీరు ఇద్దరు సైకోల్లాంటి వారు. కలిసి సినిమా చేస్తే పూర్తవుతుందా అని ఫైనాన్సియర్స్, బ్యాంకర్లు ప్రశ్నించారు. ఓ 20 రోజులు సినిమా షూటింగ్ చేయండి. ఆ తర్వాత పరిస్థితులు బాగుంటే ఫైనాన్స్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తాం అని అన్నారు అని విశాల్ తెలిపారు.

     ఎనిమిది సంవత్సరాల నుంచి

    ఎనిమిది సంవత్సరాల నుంచి

    మిస్కిన్‌గారి దర్శకత్వంలో ఎనిమిదేళ్లుగా పనిచేయాలని అనుకుంటూ ఉండేవాడిని. కానీ వీలుకాలేదు. చివరకు ఎనిమిదేళ్ల తర్వాత కుదిరింది. ముందు నాలుగైదు లైన్స్‌ అనుకున్నాం కానీ నచ్చలేదు. చివరకు మిస్కిన్‌గారు డిటెక్టివ్‌ కాన్సెప్ట్‌తో చెప్పిన ఈ లైన్‌ బాగా నచ్చింది. నటుడు ప్రసన్న ఇందులో నా స్నేహితుడి పాత్రలో నటించారు.

     హలీవుడ్ స్థాయిలో

    హలీవుడ్ స్థాయిలో

    డిటెక్టివ్ సినిమా హాలీవుడ్‌ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాం. ఈ చిత్రం సర్ అర్థర్ కోనన్ డోయ్‌లే రూపిందించిన డిటెక్టివ్ క్యారెక్టర్ షెర్లాక్ హోం ఇన్సిపిరేషన్. డిటెక్టివ్ సినిమాలు అంటే షెర్లాక్ హోం సినిమాలే గుర్తొస్తాయి. ఆ కార్యెక్టర్ నుంచే స్ఫూర్తి పొంది సినిమా తీశాం. టైటిల్స్‌లో కూడా క్రెడిట్ ఇచ్చాం అని విశాల్ చెప్పారు.

     అప్పుడు ఆండ్రియా గుర్తొచ్చింది..

    అప్పుడు ఆండ్రియా గుర్తొచ్చింది..

    సినిమాలో ఓ గ్రే షేడ్స్‌ ఉన్న లేడీ పాత్ర వుంటుంది. దాన్ని ఎవరూ చేస్తే బావుంటుందని ఆలోచిస్తే..నాకు ఆండ్రియా గుర్తుకు వచ్చింది. తనైతే పాత్రకు న్యాయం చేస్తుందని భావించాం. అనుకున్నట్లుగానే తను పాత్రకు న్యాయం చేసింది. సినిమా కోసం తను పడ్డ కష్టం నాకు తెలుసు. యువ అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌ మంచి పాత్రలో నటించింది.

     బురుద గుంటలో ఆండ్రియా

    బురుద గుంటలో ఆండ్రియా

    క్లైమాక్స్‌ ఫైట్‌ను పిచ్చాగరం అనే ప్లేస్‌లో షూట్‌ చేశాం. అక్కడ టాయిలెట్ లాంటి కనీస వసతులు కూడా కల్పించలేం. అటువంటి ప్లేస్‌లో, మురికి నీళ్లలో ఆండ్రియా నటించింది. ఫరెఫెక్షన్ కోసం బురద గుంటలో చాలా సార్లు పడాల్సి వచ్చింది. నా కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ ఇది. తెలుగు ఆడియెన్స్‌కు కొత్త ఫీల్‌ను ఇస్తుంది.

    సక్సెస్‌లో మీడియా రోల్

    సక్సెస్‌లో మీడియా రోల్

    వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. వినయ్‌ ఇందులో డెవిల్‌ అనే విలన్‌ పాత్రలో నటించాడు. అలాగే భాగ్యరాజ్‌గారు కూడా నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో కనిపించారు. సినిమాకు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మెయిన్‌ ఎసెట్‌గా నిలిచింది. తెలుగు సినిమా సక్సెస్‌లలో మీడియా మెయిన్‌ రోల్‌ తీసుకుంటుంది. పీఎర్వో బీఏ రాజు తన వారింటి హీరోలా భావించి సినిమా ప్రమోషన్స్‌ చేస్తుంటారు'' అన్నారు.

    English summary
    Hero Vishal, Director Mysskin's latest move is Detective. This movie get huge response in Tamil. Telugu version of this movie is set to release on November 10th. In this occassion, Hero Vishal speaks to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X