twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోడ్డు ప్రమాదంలో యువ దర్శకుడు మృతి.. విషాదంలో డైరెక్టర్ శంకర్

    |

    సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ను మరోసారి విషాదం వెంటాడింది. ఆయనకు అత్యంత ఇష్టమైన శిష్యుడు, తనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఏవీ అరుణ్ ప్రసాద్ అలియాస్ వెంకట్ పక్కర్ ఆకస్మిక మరణంతో ఆయన తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అరుణ్ ప్రశాంత్ మరణంతో సినిమా పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువ దర్శకుడు మరణించడంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్ మరణం గురించి మరిన్ని వివరాలు..

    రోడ్డు ప్రమాదంలో

    రోడ్డు ప్రమాదంలో

    శుక్రవారం ఉదయం కోయంబత్తూర్‌కు సమీపంలో ని మెట్టుపాలయమ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణ్ ప్రసాద్ దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయనను హాస్పిటల్‌కు తరలించగా మార్గమధ్యంలో మరణించినట్టు తెలిసింది. అరుణ్ ప్రసాద్ వయసు 35 సంవత్సరాలు.

    సోషల్ మీడియాలో శంకర్ సంతాపం

    సోషల్ మీడియాలో శంకర్ సంతాపం

    అరుణ్ ప్రసాద్ మృతివార్త తెలియగానే దర్శకుడు శంకర్ షాక్ గురయ్యారు. అరుణ్ ఆకస్మిక మరణం నన్ను కుంగదీసింది. నా వద్ద చాలా కాలం అసిస్టెంట్‌గా పనిచేశారు. అరుణ్‌లో సానుకూల దృక్పథం, మంచితనం, కష్టించే మనస్తత్వం నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. అలాంటి వ్యక్తి సడెన్‌గా లేరంటే నమ్మలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలుగాలి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకొంటున్నాను. వారికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని శంకర్ ఫేస్‌బుక్‌లో పోస్టులో పేర్కొన్నారు.

    Recommended Video

    Shivathmika Rajasekhar New Film Vidhi Vilasam Lunch Event
    జీవీ ప్రకాశ్ సంతాపం

    జీవీ ప్రకాశ్ సంతాపం

    అరుణ్ ప్రసాద్ మరణంతో జీవీ ప్రకాశ్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. నాకు అత్యంత ఇష్టమై వ్యక్తి వెంకట్ పక్కర్ ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ వార్తతో నేను విషాదంలో మునిగిపోయాను. అరుణ్‌లో ఉండే పాజిటివ్ ఎనర్జీ నాకు చాలా నచ్చేది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకొంటున్నాను. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని అన్నారు.

    English summary
    Sensational Director Shankar's assistant AV Arun Prasad no more. He died in road accident at Coimbatore. He was directed 4G movie with GV Prakash and Gayathri Suresh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X