Don't Miss!
- News
Tarakaratna: లోకేష్ పాదయాత్రలో అపశృతి.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న.. బెంగళూరుకు తరలింపు..!
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Sports
Team India : నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి?.. కోచ్‌ను సూటిగా అడిగేసిన టీమిండియా ప్లేయర్!
- Lifestyle
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!
- Technology
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
నగ్నంగా కనిపించా.. అన్నీ అలాంటి ఆఫర్సే.. అందరూ అదే అడుగుతున్నారు: హీరోయిన్ ఆవేదన
రంగుల ప్రపంచంలో నటనా వృత్తి ఎంచుకున్నాక అన్నిరకాల సీన్స్ చేయాల్సి ఉంటుంది. కథ డిమాండ్ చేయాలే గానీ కెమెరా ముందు శృతిమించి రొమాంటిక్ సీన్స్ పండించక తప్పదు. అయితే ఇలాంటి సీన్లలో నటించిన హీరోయిన్స్.. కొన్ని సందర్భాల్లో విడుదల తర్వాత పలు ఇబ్బందులకు గురికావడం చూస్తున్నాం. తాజాగా నటి తమిళ ఆండ్రియా విషయంలో అదే జరిగిందట. వివరాల్లోకి పోతే..

నటి ఆండ్రియా ఎంట్రీ.. పెద్ద హీరోలతో రొమాన్స్
కండనాళ్ ముదల్ అనే సినిమాతో కోలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైన ఆండ్రియా.. ఆ తర్వాత శరత్ కుమార్‌తో 'పచ్చైకిళి ముత్తుచ్చరం', కార్తితో 'ఆయిరత్తిల్ ఒరువన్', కమలహాసన్‌తో 'విశ్వరూపం', అజిత్‌తో 'మంగాత్త' లాంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

వడ చెన్నై.. నగ్నంగా ఆండ్రియా
ఇదే సక్సెస్ ఊపులో ఆమె నటించిన చిత్రం 'వడ చెన్నై'. ఈ సినిమాలో ఆండియా రెచ్చిపోయి నటించింది. పడక సన్నివేశాల్లోనూ నటించి అందరి చూపు తనపై పడేలా చేసుకుంది. కొన్ని సీన్లలో అయితే నగ్నంగా కూడా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రాజుకున్న వివాదం.. సామాజిక మాధ్యమాల్లో ఆ సన్నివేశాలు
ఈ 'వడ చెన్నై' సినిమాలో ఆండ్రియా నగ్నంగా కనిపించడంపై అప్పట్లో పెను వివాదం రాజుకుంది. దీంతో ఆ సీన్లు సినిమా నుంచి తొలగించారు కూడా. అయితే అప్పటికే ఆ సీన్లు కొందరు చూసేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. దీంతో అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అన్నీ అలాంటి ఆఫర్సే.. అందరూ అదే అడుగుతున్నారు
ఈ నేపథ్యంలో సదరు పడక సీన్స్‌లో నటించడం పట్ల రియాక్ట్ నటి అయింది ఆండ్రియా. అలాంటి సీన్స్ చేసి పొరపాటు చేశానని, దీంతో ఇప్పుడు అలాంటి ఆఫర్స్ మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
Recommended Video


నేను రెడీ.. కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్
అయితే తనకు మంచి స్టోరీలో నటించే అవకాశం వస్తే, పారితోషికాన్ని తగ్గించుకునేందుకు కూడా రెడీ అని అంటోంది ఆండ్రియా. ప్రస్తుతం ఈ భామ 'మాళిగై', 'మాస్టర్', 'అరణ్మనై-3' చిత్రాలతో బిజీగా ఉంది. ఆండ్రియా మాట్లాడిన తీరు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.