అక్కడ తమన్నా స్ట్రాంగ్ ఫ్యాలోయింగ్ తో ఎర వేస్తున్న జూ ఎన్టీఆర్..!?

By Sindhu

జూ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'ఊసరవెల్లి" చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం విధితమే. గత కొన్ని నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ బాక్స్ ఆఫీసును డామినేట్ చేస్తున్నాయి తమిళ చిత్రాలు. తెలుగు ప్రేక్షకుల నుండి కార్తీ, జీవా వంటి వారు మంచి మార్కులతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ని బాగా పెంచేసుకొంటున్నారు. ఈ పరిస్తితుల్లో భారీ ప్రచారం మధ్య జూ ఎన్టీఆర్ ఊసరవెల్లి తమిళనాడులో రిలీజ్ అవ్వబోతుంది . ఒక్క చెన్నైలోనే 9 థియేటోర్స్ లో ఈ పిక్చర్ రిలీజ్ కాబోతుందని సమాచారం.

తమిళనాడులో నందమూరి తారక రామారావుగారికి మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉండేది. అది జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతోంది. తమిళంలో నంబవర్ వన్ స్థానంలో ఉన్న హీరోయిన్ తమన్నా. తెలుగులో అగ్రస్థానం కోసం ఇతర హీరోయిన్లతో పోటీ పడుతోంది. అటు మిల్కీ బ్యూటీ తమన్నాకు తమిళంలో చాల మంది అభిమానులు ఉన్నారన్నవిషయం తెలిసిందే.. తమన్నా సూర్య, కార్తీ, జీవా, శింబు, వంటి స్టార్స్ తో నటించి తనకంటూ ఓ క్రేజ్ ను సొంతం చేసుకొన్నది. ఇవన్నీ ఊసరవెల్లి మూవీ విజయానికి ఎంతోకొంత దోహదపడతాయనే చెప్పొచు.

ఊసరవెల్లి సినిమా పూర్తి చేసిన జూ ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోకుండా తన తదుపరి సినిమాతో జిజీ కానున్నాడని తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్వకత్వంలో జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న (దమ్ము-వర్కింగ్ టైటిల్) చిత్రానకి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈ 28 నుంచి ఆరంభంకానుందట. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆరంభం కానున్న ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు శృతిహాసన్ కూడా నటిస్తుందోని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X