ఇస్లాం మతంలోకి ఇళయరాజా తనయుడు (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ దక్షిణాది సంగీత దర్శకుడు, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా తనయుడు యువన్ శంకర్ రాజా ఇస్లాం మతంలోకి మారుతున్నారు. ఈ విషయాన్ని యువన్ శంకర్ రాజా స్వయంగా వెల్లడించారు. తొలుత మీడియాలో ఈ విషయమై వార్తలు రాగా....ట్విట్టర్ ద్వారా ఈ వార్తలు నిజమే అంటూ ధృవీకరించాడు యువన్ శంకర్ రాజా.

తన నిర్ణయానికి కుటుంబ సభ్యుల అంగీకారం కూడా ఉందని, ఈ ఇష్యూ గురించి ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవచ్చని...తన గురించి కానీ, తన తండ్రి ఇళయరాజా గురించి ఎలాంటి మిస్ అండర్ స్టాండింగ్ చేసుకోవద్దని యువన్ శంకర్ రాజా తన ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరారు.

'నేను ఇస్లాంను ఫాలో కావాలని నిర్ణయించుకున్నాను. ఇందుకు గర్వంగా ఉంది. మా ఫ్యామిలీ సపోర్టు కూడా ఉంది. నా తండ్రికి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు' అంటూ యువన్ శంకర్ రాజా తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. యువన్ శంకర్ రాజా తన తల్లితో చాలా క్లోజ్‌గా ఉండే వారు. ఇటీవల అక్టోబర్ 31, 2011న ఆమె మరణించడంతో యువన్ చాలా డిస్ట్రబ్ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ ఆధ్యాత్మిక గురువును కలిసిన యువన్ శంకర్ రాజా...ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. స్లైడ్ షోలో ఇందుకు సంబంధించిన మరిన్ని ఫోటోలు, వివరాలు...

ఏఆర్. రెహమాన్ దారిలో..?

ఏఆర్. రెహమాన్ దారిలో..?


ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చిన్న తనంలోనే హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆయన దారిలోనే యువన్ శంకర్ రాజా ప్రయాణిస్తుండటం చర్చనీయాంశం అయింది.

యువన్ ఖండన

యువన్ ఖండన


అయితే తాను ఏఆర్ రెహమాన్ ఆదర్శంగా తీసుకుని ఇస్లాంలోకి మారుతున్నాననే వార్తలను యువన్ శంకర్ రాజా ఖండిస్తున్నట్లు సమాచారం.

రోజూ 5 సార్లు నమాజ్

రోజూ 5 సార్లు నమాజ్


గత సంవత్సర కాలం నుండి ఇస్లాంలోకి మారే ఆలోచనలో యువన్ శంకర్ రాజా ఉన్నారని, ఇందుకోసం ఆయన రోజూ 5 సార్లు నమాజ్ చేస్తున్నారని, ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తప్పకుండా నమాజ్‌కు సమయం కేటాయిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

పేరు మార్చుకుంటారా?

పేరు మార్చుకుంటారా?


సాధారణంగా ఇస్లాంలోకి మారిన చాలా మంది తమ పేరును కూడా మార్చుకుంటూ ఉంటారు. మరి యువన్ శంకర్ రాజా కూడా తన పేరును మార్చుకుంటారా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది.

యువన్ కెరీర్...

యువన్ కెరీర్...


తండ్రి ఇళయరాజా సంగీత వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యువన్ శంకర్ రాజా దక్షిణాదిన సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా ఎదిగారు. ఆయన కెరీర్లో ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X