twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువన్‌ శంకర్‌రాజా... ముస్లింగా ఎందుకు మారారంటే

    By Srikanya
    |

    చెన్నై : 'ఇసైజ్ఞాని' ఇళయరాజా కుమారుడు యువన్‌ శంకర్‌రాజా దాదాపు వందలకు సంగీతం సమకూర్చి పేరొందారు. ఇటీవల ఆయన ముస్లింగా మారారు. రంజాన్‌ సందర్భంగా మసీదుకు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేశాయి.

    దీనిపై యువన్‌ వివరణ ఇస్తూ.. ''మత మార్పునకు కారణం అమ్మే. ఆమె అనారోగ్యం పాలైనప్పుడు ముంబయిలో ఉన్నా. వెంటనే చెన్నైకి వచ్చా. సోదరితో కలిసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లా. ఆమె నా చెయ్యి పట్టుకుని ఆవేదన చెందారు. తరువాత దూరమయ్యారు. అమ్మ ఏమైపోయిందోనని ఆలోచించా. ఆమె ఆత్మ ఎలా రూపాంతరం చెందిందోనని వెతకడం ప్రారంభించా.

    Yuvan Shankar Raja: I converted to Islam in a way because of my mother

    నా ముస్లిం స్నేహితుడొకరు.. మక్కాలో తాను ప్రార్థన చేసిన చాపను నాకు ఇచ్చారు. గుండె భారంగా ఉన్నప్పుడు దీనిపై కూర్చోమని చెప్పారు. దాన్ని నా గదిలో పెట్టేశాను. ఓ సారి మరో మిత్రుడితో అమ్మ గురించి మాట్లాడుతుండగా ఆ చాపపై కూర్చున్నా. ఖురాన్‌ పఠించడం ప్రారంభించా. జనవరిలో మతం మారాలని నాన్నతో చెప్పా. అడ్డుకోలేదు. ఆ తరుణంలోనే అమ్మ నా చేయి పట్టుకుని 'నువ్వు ఒంటరిగా ఉన్నావు. ముస్లిం అనే మహావృక్షం కింద కూర్చోమ'ని సలహా ఇచ్చినట్లు అనిపించింది. అలా మతం మారాను'' అని పేర్కొన్నారు.

    English summary
    Yuvan Shankar Raja, 34, called lovingly Yuvi at home, is not just the legend Ilaiyaraaja's younger son, but is also India's youngest composer, who did his first Tamil film music at the age of 16.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X