మతం మార్చుకున్న సంగీత దర్శకుడు.. భార్య ఒత్తిడే కారణమని నెటిజన్స్ ఫైర్
సంగీత దర్శకులు మతం మార్చుకోవడం మనకు తెలిసిందే. ఎవరి నమ్మకాలు వారివే అయినా.. కొన్ని సార్లు ఇవి వివాదాస్పదంగా మారుతాయి. దిలీప్ కుమార్ కాస్త మతం మార్చుకుని ఏ.ఆర్.రెహమాన్ అయ్యాడు. అల్లా ఆశీస్సులతోనే తాను గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగానని.. ఖురాన్ తాను మెచ్చిన పవిత్ర గ్రంధం అని రెహమాన్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మరో సంగీత దర్శకుడు కూడా మతం మారాడు. ఈ విషయంలో ఆయన భార్యే చలువే ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ కథేంటో ఓ సారి చూద్దాం.
Recommended Video

ఇళయ రాజా కుమారుడు..
ఇళయ రాజా కుమారుడు యువన్ శంకర్ రాజా కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ సుపరిచితుడే. డబ్బింగ్ చిత్రాలతోనే కాకుండా నేరుగా తెలుగు చిత్రాలకు కూడా యువన్ సంగీతాన్నిసమకూర్చాడు. ఆయన సంగీతం ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో మలుపులు ఉన్నాయి.

అచ్చిరాని వివాహాలు..
యువన్.. 2002లో సుజయ చంద్రన్ ని పెళ్లాడాడు. అయితే కొద్దికాలానికే అతడు అటుపై ఆమె నుంచి విడిపోయాడు. ఆ తర్వాతా 2011లో శిల్పా మోహన్ ని పెళ్లాడాడు. కాపురంలో కలతల వల్ల ఆమె నుంచి విడిపోయాడు. ఇటీవలే జాఫ్రూన్ ని మూడో వివాహం చేసుకున్నారు.

మతమార్పిడి..
యువన్-జాఫ్రూన్‌లకు ఓ కూతురు కూడా జన్మించింది. మతమార్పిడి తర్వాత యువన్ శంకర్.. అబ్ధుల్ ఖాలిక్ అని పేరు మార్చుకున్నాడు. ఈ వివాహానికి యువన్ కుటుంబ సభ్యుల మద్ధతు లేదని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. తాజాగా జఫ్రూన్ లైవ్‌లోకి రావడంతో ఆమెకు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురయ్యాయి.

భార్య ఒత్తిడి వల్లే..
భార్య ఒత్తిడికి తలొగ్గి ఇళయరాజా వారసుడు యువన్ శంకర్ రాజా మతమార్పిడికి పాల్పడ్డారా.. అంటూ తాజాగా సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. లైవ్‌లోకి వచ్చిన జఫ్రూన్‌ను ఉద్దేశిస్తూ.. మీ ఒత్తిడి వల్లనే హిందువు అయిన ఇళయరాజా కుమారుడు ముస్లిముగా మారాడంటూ ఆమెను టార్గెట్ చేశారు.

వివాహానికి మూడేళ్ల క్రితమే..
నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు జాఫ్రూన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నేరుగా ఆయనే లైవ్ లోకి వచ్చి మాట్లాడతారు.. అప్పుడే మీ సందేహం తీరుతుందని చెప్పుకొచ్చింది. తనను కలవక ముందే దాదాపు మూడేళ్ల క్రితమే యువన్ మతం మారారని.. తాను కోరుకునే అన్ని సమాధానాలను ఖురాన్ లో కనుగొన్నారని చెప్పుకొచ్చింది. తమ మనసులు కలిసాయని, పెళ్లి చేసుకున్నామని పేర్కొంది.


Click it and Unblock the Notifications











