హీరోగా స్టార్ మ్యూజిక్ డైరక్టర్ ఎంట్రీ ఖరారు
ఎస్కేఫ్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్ బ్యానరుపై ఎస్.మథన్ నిర్మిస్తున్నట్లు సమాచారం. సినిమా కోసం నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నాడట. రోజూ వ్యాయామం చేస్తూ శరీరాకృతిని ఆకర్షణీయంగా మార్చుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చిత్రాలకు సంగీతం అందించాలంటే మూడు నెలలు వేచి ఉండాల్సిందేనని దర్శక, నిర్మాతలకు చెబుతున్నాడు.
మరో ప్రక్క ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్‌తో కలిసి యువన్‌శంకర్ రాజా వెండితెరపై కనిపించనున్నాడు. 'తిల్లుముల్లు'... రజనీకాంత్ కెరీర్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ప్రస్తుతం ఇదే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మిర్చి శివ, ఇషా తల్వార్‌లు జంటగా నటిస్తున్నారు.
ఎమ్మెస్ విశ్వనాథన్, యువన్‌శంకర్‌రాజాలు సంయుక్తంగా స్వరాలు సమకూరుస్తున్నారు. మరో విశేషమేమిటంటే 'తిల్లుముల్లు తిల్లుముల్లు' అనే పాటకు ఇద్దరూ కలిసి స్టెప్పులు కూడా వేశారట. వెండితెరపై ఈ పాట ప్రేక్షకులకు కొత్త ఆనుభూతి పంచుతుందని యూనిట్ అంటోంది. తెలుగులోనూ దేవిశ్రీప్రసాద్ హీరో అవుతాడని చాలా కాలం నుంచి అంటున్నారు..కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.


Click it and Unblock the Notifications












