Bigg Boss Telugu 7: 10వ వారం ఎలిమినేషన్ ఎవరంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో 10వ వారం కూడా ఆసక్తిగా సాగుతోంది. ఇక హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చి.. తనదైన శైలిలో షోను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తొలి విడుతగా ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవ్వగా... ఐదో వారంలో మరో 5 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఉన్నారు. ఇక ఎనిమిదో వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 10వ వారం ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు? అనే ప్రశ్నకు భోలే షవాలీకి 14 శాతం మంది, గౌతమ్ కృష్ణకు 21 శాతం మంది, శివాజీకి 9 శాతం మంది, ప్రిన్స్ యావర్ కు 10 శాతం మంది, రతిక రోజ్ కు 44 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన నెటిజన్ల దృష్టిలో రతికా రోజ్ ఈ వారం ఎలిమినేట్ కావాలి.

బిగ్‌బాస్ తెలుగు 7లో 9వ వారంలో టేస్టీ తేజ ఎలిమినేషన్ కరెక్టేనా? అనే ప్రశ్నకు అవును అని 63 శాతం మంది, కాదు అని 33 శాతం మంది ఓటు వేయగా.. చెప్పలేం అని 3 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన టేస్టీ తేజ ఎలిమినేషన్ కరెక్ట్ అని నెటిజన్స్ భావించారు.

బిగ్‌బాస్ తెలుగు 7 ఎలా సాగుతున్నది? అనే ప్రశ్నకు బాగుంది 37 అని శాతం మంది, బాగాలేదు అని 51 శాతం మంది ఓటు వేశారు. ఇక ఏమీ చెప్పలేమని 11 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ సీజన్ చాలా మందికి నచ్చలేదని తెలుస్తోంది.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో ఎవరు విజేతగా నిలుస్తారని అనుకొంటున్నారు? అనే ప్రశ్నకు శివాజీకి 51 శాతం మంది, గౌతమ్ కృష్ణకి 4 శాతం మంది, ప్రియాంక జైన్ కి 2 శాతం మంది, శోభా శెట్టికి 4 శాతం మంది, రతికకి 4 శాతం మంది, భోలే షవాలీకి 3 శాతం మంది, ప్రిన్స్ యావర్కి 5 శాతం మంది, అమర్ దీప్ కి 8 శాతం మంది, అశ్వినీ శ్రీకి 2 శాతం మంది, పల్లవి ప్రశాంత్ కి 11 శాతం మంది ఓటు వేశారు. అయితే ఈ సీజన్ విన్నర్ శివాజీగా నెటిజన్స్ భావిస్తున్నారు.

రాజమాత కాన్సెప్ట్‌తో 10వ వారం నామినేషన్ ప్రక్రియ కరెక్టేనా? అనే ప్రశ్నకు అవును 27 అని శాతం మంది.. కాదు అని 77 శాతం మంది ఓటు వేశారు. ఇక ఏమీ చెప్పలేమని 0 శాతం మంది ఓటు వేశారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియపై నెటిజన్స్.. కరెక్ట్ కాదని భావిస్తున్నారు. మరి దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఐదుగురు ఉన్న సంగతి తెలిసిందే. శివాజీ, బోలే షవాలి, రతికా రోజ్, యావర్, గౌతమ్ ఉన్నారు. అయితే వీరిలో బోలే షవాలి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.





Click it and Unblock the Notifications











