బిగ్ బాస్ 2: కౌశల్‌తో సహా ఆ నలుగురు నామినేట్ అయ్యారు!

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 71 Highlights...!

బిగ్‌బాస్ తెలుగు 2 రియాల్టీ షో విజయవంతంగా 10 వారాలు పూర్తి చేసుకుంది. గతవారం ఇంటి నుండి దీప్తి సునైన ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 11వ వారం ఎలిమినేషన్ కోసం మళ్లీ నామినేషన్స్ నిర్వహించారు. సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్లో దీప్తి సునైనా వెళ్లిపోయిన తర్వాత తనీష్ ఆమెను మిస్సయిన బాధలో ఉండిపోయినట్లు కనిపించింది. సామ్రాట్‌కు కాస్త అనారోగ్యంగా ఉన్నట్లు, అతడి కేరింగ్ అంతా గీతా మాధురి చూసుకుంటున్న దృశ్యాలు ప్రసారం అయ్యాయి. కౌశల్, దీప్తి బిగ్‌బాస్ ఇంట్లో పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. మరోసారి కెప్టెన్ అవ్వాలనే కోరికను దీప్తి బయట పెట్టింది.

తనీష్‌కు దగ్గరవ్వడానికి ప్రయత్నించిన కౌశల్

తనీష్‌కు దగ్గరవ్వడానికి ప్రయత్నించిన కౌశల్

కౌశల్, తనీష్ మధ్య విబేధాలు ఉన్నట్లు కనిపిస్తుంటుంది. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని నిరూపించే ప్రయత్నంలో.... తనీష్‌తో మాటలు కలిపే ప్రయత్నం చేశాడు కౌశల్. ఇక నుండి కలిసి గేమ్ ఆడదామని సూచించాడు.

 సామ్రాట్ స్నేహితుడే, నా భర్తే ముఖ్యం: గీత మాధురి

సామ్రాట్ స్నేహితుడే, నా భర్తే ముఖ్యం: గీత మాధురి

గీత మాధురి, శ్యామల, దీప్తి మాట్లాడుకుంటుండగా.... బిగ్ బాస్ ఇంట్లో ఎవరెవరితో ఎలాంటి రిలేషన్ ఉందనే టాపిక్ వచ్చింది. దీప్తి, శ్యామల కలిసి.... సామ్రాట్‌తో గీతా మాధురికి ఉన్న క్లోజ్ రిలేషన్ గురించి ప్రస్తావించారు. దీంతో గీతా మాధురి రియాక్ట్ అవుతూ...నా జీవితంలో నందు(భర్త) స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరని.... సామ్రాట్, తనీష్, రోల్ రైడాలతో స్నేహంగా ఉంటున్నాను, అందులో తప్పు లేదని భావిస్తున్నట్లు తెలిపారు.

నామినేషన్ ప్రక్రియ డిఫరెంటుగా

నామినేషన్ ప్రక్రియ డిఫరెంటుగా

ఈ సారి నామినేషన్ ప్రక్రియ డిఫరెంటుగా నిర్వహించారు. ఈ వారం ప్రతి పోటీదారు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని, ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి టీవీ ఆఫ్ చేయాలని బిగ్ బాస్ సూచించారు. ఎందుకు నామినేట్ చేస్తున్నారో కూడా పోటీ దారులు వివరించాల్సి ఉంటుందని సూచించారు.

 సామ్రాట్ ఎవరిని నామినేట్ చేశాడంటే

సామ్రాట్ ఎవరిని నామినేట్ చేశాడంటే

సామ్రాట్ ముందుగా పూజను, ఆ తర్వాత కౌశల్‌ను నామినేట్ చేశాడు. పూజా కేవలం టాస్కుల మీదనే దృష్టిపెడుతోందని, బిగ్ బాస్ ఇంటితో సరైన అనుబంధం పెంచుకోవడం లేదన్నారు. కౌశల్ తనకంటే బలమైన పోటీదారుడు కాబట్టి నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు.

గీత మాధురి ఆ ఇద్దరినీ..

గీత మాధురి ఆ ఇద్దరినీ..

గీత మాధురి... కౌశల్, తనీష్‌లను నామినేట్ చేసింది. కౌశల్ తన గ్రేమ్ ను ప్రభావితం చేస్తున్నాడని, ఇంట్లో అతడి డామినేషన్ తనకు నచ్చడం లేదన్నారు. తన గేమ్ ప్లాన్ ఇతర సభ్యులకు చెబుతున్నాడని తెలిపారు. తనీష్ తనే బాస్ లాగా, డామినేటింగ్ గా వ్యవహరించడం నచ్చలేదన్నారు.

దీప్తి నల్లమోతు...

దీప్తి నల్లమోతు...

తన వంతు వచ్చినపుడు దీప్తి నల్లమోతు.... అమిత్, సామ్రాట్‌లను నామినేట్ చేసింది. అమిత్ సేఫ్ గా గేమ్ ఆడుతూ చాలా సార్లు ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడని, సామ్రాట్ కూడా చాలా తక్కువ నామినేషన్స్ ఎదుర్కొన్నాడని తెలిపారు.

తనీష్ ఆ ఇద్దరినీ...

తనీష్ ఆ ఇద్దరినీ...

తనీష్... పూజా రామచంద్రన్, దీప్తి నల్లమోతును నామినేట్ చేశాడు. ఈ ఇద్దరూ ఇంట్లో సరిగా గేమ్ ఆడటం లేదని సూచించారు. పూజా సేఫ్‌గా ఉండటానికి కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తోందని, దీప్తి వల్ల కొన్ని విషయాల్లో గందరగోళం ఏర్పడుతుందన్నారు.

శ్యామల, పూజ, కౌశల్, గణేష్, రోల్

శ్యామల, పూజ, కౌశల్, గణేష్, రోల్

శ్యామల.... పూజ రామచంద్రన్, అమిత్ త్రివేదిని, గణేష్... కౌశల్, పూజాను, పూజా.... గణేష్, శ్యామలను, అమిత్.... దీప్తి, తనీష్‌ను, కౌశల్..... తనీష్, సామ్రాట్‌ను, రోల్ రైడా... కౌశల్, దీప్తి నల్లమోతును వారి వారి కారణాలు చెప్పి నామినేట్ చేశారు.

 ఈ వారం నామినేట్ అయింది వీరే

ఈ వారం నామినేట్ అయింది వీరే

ఈ వారం మొత్తం నలుగురు నామినేట్ అయ్యారు. ఇందులో పూజా రామచంద్రన్, కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు ఉన్నారు. 11వ వారం ఇంటి నుండి ఈ నలుగరిలో ఒకరు బయటకు వెళ్లబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X