Bigg Boss Telugu 7: 11వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ లేడీ కంటెస్టెంట్? టైటిల్ విన్నర్ అతనే!
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో 11వ వారం కూడా ఆసక్తిగా సాగుతోంది. ఇక హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చి.. తనదైన శైలిలో షోను నడిపిస్తున్నారు. ఇక తొలి విడుతగా ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవ్వగా... ఐదో వారంలో మరో 5 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక 11వ వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 11వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు? అనే ప్రశ్నకు ప్రియాంక జైన్ కు 9 శాతం మంది ఓటింగ్, యావర్ కు 3శాతం ఓటింగ్, శోభా శెట్టికి 38 శాతం ఓటింగ్, గౌతమ్ కు 3 శాతం ఓటింగ్, అమర్ 3 శాతం ఓటింగ్, అర్జున్ కు 6 శాతం ఓటింగ్, అశ్విని శ్రీకి 13 శాతం ఓటింగ్, రతికా రోజ్ కి 21 శాతం ఓటింగ్ జరిగింది. అయితే నెటిజన్ల ప్రకారం శోభా శెట్టి ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారు. మరి ఈ వారం ఈ బ్యూటీ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.

బిగ్‌బాస్ తెలుగు 7లో 10వ వారంలో బోలే షవాలి ఎలిమినేషన్ కరెక్టేనా? అనే ప్రశ్నకు భారీ ఎత్తున నెటిజన్స్ ఓటింగ్ లో పాల్గొన్నారు. అవును అని 46 శాతం మంది ఓటు వేయగా.. కాదు అని 48 శాతం మంది ఓటింగ్ వేశారు. ఇక ఏమీ చెప్పలేమని 5 శాతం మంది ఓటు వేశారు. ఇక 10 వారంలో బోలే షవాలి ఎలిమినేషన్ కరెక్ట్ అని చాలా మంది భావిస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7 ఎలా సాగుతున్నది? అనే ప్రశ్నకు బాగుంది అని 35 శాతం మంది ఓటు వేయగా.. బాగాలేదు అని 51 శాతం మంది ఓటు వేశారు. ఇక ఏమీ చెప్పలేమని 12 శాతం మంది ఓటు వేశారు. అయితే నెటిజన్ల సర్వే ప్రకారం ఈ సీజన్ చాలా మందికి నచ్చడం లేదని తెలుస్తోంది.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో ఎవరు విజేతగా నిలుస్తారని అనుకొంటున్నారు? అనే ప్రశ్నకు భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. ఇక శివాజీ విన్ అవుతారని 54 శాతం మంది ఓటు వేయగా... గౌతమ్ కృష్ణకు 8 శాతం మంది, ప్రియాంక జైన్కు 3 శాతం మంది, శోభా శెట్టికు 6 శాతం మంది, రతికకు 2 శాతం మంది, ప్రిన్స్ యావర్కు 2 శాతం మంది, అమర్ దీప్ కు 9శాతం మంది, అశ్వినీ శ్రీకు 3 శాతం మంది, పల్లవి ప్రశాంత్ కు 11 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ సీజన్ విన్నర్ నెటిజన్స్ ప్రకారం.. శివాజీ విన్ అవుతారని తెలుస్తోంది.

10వ వారం నామినేషన్ ప్రక్రియలో ప్రియాంక వల్ల అశ్వినికి దెబ్బ తగిలిందా? అనే ప్రశ్నకు అవును 54 అని శాతం మంది, కాదు అని 43 శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేమని 2 శాతం మంది ఓటు వేశారు. ఇక నెటిజన్స్ దృష్టిలో ప్రియాంక రాంగ్ అని తేలింది.

ఇక 11వ వారం నామిమనేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈసారి శోభా శెట్టి లేదా రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలనుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. చూడాలి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











