Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ చరిత్రలో సంచలనం.. వైల్డ్ కార్డుతో 12 మంది కంటెస్టెంట్లు.. ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో నాలుగో వారంలోకి చేరుకొన్నది. అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఈ షో ప్రారంభానికి ముందే.. చాలా కొత్తగా ఎవరూ ఊహించని విధంగా ఉంటందని చెబుతూ వస్తున్నారు. అలాగే 8 అంకేను సూచించే విధంగా ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్‌తో ప్రారంభమైంది. అయితే ఈ షోలో అపరిమితమైన ట్విస్టులు, టర్నులు ఉంటాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి అనే విషయాన్ని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అయితే చెప్పినట్టే ఆయన భారీ ట్విస్టు ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు షో సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ గేమ్ షోను పాపులర్ హోస్ట్ నాగార్జున అక్కినేని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇంటిలోకి 14 మంది సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా పంపారు. నైనిక, బేబక్క, యష్మీ గౌడ, ఆదిత్య ఓమ్, నిఖిల్ మాలియక్కల్, అభయ్ నవీన్, శేఖర్ భాషా, కిర్రాక్ సీత, సోనియా ఆకుల, విష్ణుప్రియ, ప్రేరణ, మణికంఠ, నబీల్ అహ్మద్, పృథ్వీ తదితరుల కంటెస్టెంట్లుగా ఇంట్లోకి వచ్చారు.

అయితే తొలివారం ఈ షో నుంచి ఎలిమినేషన్ గురైన కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. ఆమెను ఇంటి నుంచి ఎలిమినేట్ కావడం షాకింగ్‌గా మారింది. ఆ తర్వాత ఆర్జే శేఖర్ భాషాను ఎలిమినేట్ చేశారు. ఇలా రెండు షాకుల నుంచి కోలుకముందే తాజాగా అభయ్ నవీన్‌ను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇలా మూడు వారాల్లో ముగ్గురు బయటకు పోవడంతో కేవలం 11 మంది మాత్రమే మిగిలారు.
తాజాగా షోలో బిగ్‌బాస్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇచ్చాం. వాటన్నిటి కంటే బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం. బిగ్‌బాస్ చరిత్రలో అన్ని కంటే పెద్దది. మొదటిసారి ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు కూడా కాదు.. 12 మందిని వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయి. మరో రెండు వారాల్లో ఇంటిలోకి రానున్నారు అని తెలిపారు.
బిగ్‌బాస్ తెలుగు 8లోకి 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎందుకంటే.. ఈ సీజన్‌లో లిమిట్ లెస్ అవకాశాలు ఉంటాయి. ఎవరైనా తన అవకాశాన్ని అపరిమితంగా పొందవచ్చు. ఈ సీజన్‌లో ఇంకా చాలా ట్విస్టులతో ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఆ 12 మంది కంటెస్టెంట్లు వస్తే.. పరిస్థితి ఊహించుకోవడం కష్టంగానే ఉంటుందనే అర్ధమైంది.
ఇక ఇంటిలోకి 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా వస్తున్నారని చెప్పడంతో మీడియాలో అలజడి మొదలైంది. అయితే ఈ షోలోకి ఎవరెవరు వస్తున్నారానే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ఇంటిలోకి పంపేందుకు సిద్దం చేశారు. అయితే రెండు వారాల్లో మధ్యలో కొందరు.. వారాంతంలో నాగార్జున స్టేజ్ మీద నుంచి లోపలికి పంపిస్తారనే విషయం బయటకు వచ్చింది. అయితే కంటెస్టెంట్ల పేర్లను చాలా సీక్రెట్‌గా ఉంచి సర్‌ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారు. వారెవరో కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











