Bigg Boss Telugu 7: 12వ వారం ఆ టాప్ కంటెస్టెంట్ చేతిలో ఎవిక్షన్ పాస్... కానీ ఓ ట్విస్ట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో.. 11వారాలు పూర్తి చేసుకుని 12వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ షోలో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. అందులో ఈ వారం 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే గత వారం ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న యావర్.. మళ్లీ తిరిగి బిగ్ బాస్ కు ఇచ్చేశారు. ఇక ఈ వారం ఎవిక్షన్ పాస్ పోటీలు నిర్వహించారు. అయితే ఈ వారం టాప్ కంటెస్టెంట్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు రంజుగా సాగుతోంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... గత 12వారాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ షో 12వ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. కంటెస్టెంట్స్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లో 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, అర్జున్ అంబటి, పల్లవి ప్రశాంత్, అశ్విని శ్రీ ఉన్నారు. ఇక అశ్విని సెల్ఫ్ నామినేట్ చేసుకుంది.

ఇక ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, ప్రశాంత్,యావర్, అర్జున్, గౌతమ్, ప్రియాంక, శోభా, అశ్విని, రతికా, అమర్ ఇలా పది మంది ఉన్నారు. వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. టైటిల్ రేసులో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దూసుకుపోతున్నారు. ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి.. ఎవరైనా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ సీజన్ ప్రశాంత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. గత వారం ఎవిక్షన్ పాస్ కోసం పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత వారం ఎవిక్షన్ పాస్ విన్నర్ యావర్ నిలిచాడు. ఇక గత వారం ఎలిమినేషన్ కూడా తీసేయ్యటం.. దానికి రీజన్ ఎవిక్షన్ పాస్ అని చెప్పడం జరిగింది. ఇక ఈ వారం మళ్లీ ఎవిక్షన్ పాస్ కోసం పోటీలు నిర్వహించాడు బిగ్ బాస్. ఇక ఈ పోటీల్లో హౌస్ మేట్స్ అందరూ పాల్గొన్నారు. కానీ ఎవిక్షన్ పాస్ ఓ టాప్ కంటెస్టెంట్ చేతిలోకి వెళ్లింది.

అతను ఎవరో కాదు.. పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. అయితే ఇక్కడితో ఆట ముగిసిపోలేదు.. ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మళ్లీ పల్లవి ప్రశాంత్.. మిగతా వారితో గెలిచి దాన్ని కాపాడుకోవాలి. అంటే.. లాస్ట్ టైం మొదట ఎవిక్షన్ పాస్ అర్జున్ గెలుచుకున్నాడు.. అలా అర్జున్ చేతి నుంచి యావర్ కు వచ్చింది. మళ్లీ యావర్ ఇంట్లో వాళ్లతో పోటీలు గెలిచి సంపాదించుకున్నాడు.
ఇప్పుడు ప్రశాంత్ కూడా.. మిగతా వారితో పోటీ పడి.. దాన్ని కాపాడుకోవాలి. ప్రస్తుతం హౌస్ లో పోటీలు జరగుతున్నాయి. ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ ఎవిక్షన్ పాస్ తో ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారో లేదా.. ఎవరిని సేఫ్ చేస్తారో తెలియదు. వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











