12th week Elimination: షో నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్.. చివర్లో హైడ్రామా.. ఓటింగ్ వివరాలివే!

గతంలో జరిగిన వాటిని మించిన రేటింగ్‌తో దూసుకుపోతోంది బిగ్ బాస్ నాలుగో సీజన్. ప్రీమియర్ ఎపిసోడ్‌ నుంచే రికార్డు స్థాయి స్పందనను అందుకుంటోన్న ఈ సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 12 వారంలో ఎన్నో ఊహించని పరిణామాలు జరిగాయి. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ వారం ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినా.. చివర్లో హైడ్రామాలు చోటు చేసుకున్నాయి. ఓటింగ్ వివరాలు కూడా షాకిస్తున్నాయి. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఈ వారం నామినేట్ అయింది వీళ్లే

ఈ వారం నామినేట్ అయింది వీళ్లే

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు గార్డెన్ ఏరియాలో ఉంచిన టోపీలను ధరించారు. అందులో ఎరుపు రంగు ఉన్న వాళ్లు డైరెక్ట్‌గా నామినేట్ అవగా, పచ్చ రంగు వచ్చిన వాళ్లు సేవ్ అయ్యారు. ఇలా అవినాష్, ఆరియానా, అఖిల్, అభిజీత్ ఎరుపు రంగు టోపీలను ధరించి నామినేట్ అవగా, మోనాల్, సోహెల్ సేవ్ అయ్యారు. దేత్తడి హారిక కెప్టెన్ కాబట్టి ఈ టాస్కులో పాల్గొనలేదు.

హారిక నిర్ణయంతో లిస్టులో మార్పు

హారిక నిర్ణయంతో లిస్టులో మార్పు

మొదట జరిగిన ప్రక్రియలో పై నలుగురు నేరుగా నామినేట్ అవగా... సేవ్ అయిన కంటెస్టెంట్లతో ఒకరు స్వాప్ చేసుకోవచ్చని బిగ్ బాస్ సూచించాడు. ఈ క్రమంలో రెండు వర్గాల కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ ఎవరూ స్వాప్ అవలేదు. అయితే, కెప్టెన్ హారికకు బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక అధికారంతో మోనాల్‌ను అభిజీత్‌తో స్వాప్ చేసిందామె. దీంతో లిస్టు మారింది.

ఎవిక్షన్ ఫ్రీ పాస్.. అవినాష్ సొంతం

ఎవిక్షన్ ఫ్రీ పాస్.. అవినాష్ సొంతం

ఈ వారంలో నామినేట్ అయిన అఖిల్, అవినాస్, ఆరియానా, మోనాల్‌లకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ రూపంలో బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చాడు. ఈ టాస్కులో హౌస్‌లోని జెండాలను ఎవరు ఎక్కువగా సాధిస్తారో వాళ్లు తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తారని చెప్పాడు. దీని ప్రకారం.. అఖిల్, అవినాష్ ఫైనల్‌కు వచ్చారు. ఈ ఇద్దరిలో జబర్ధస్త్ కమెడియన్‌కే ఎక్కువ మద్దతు లభించడంతో పాస్ పొందాడు.

ఈ వారం షో నుంచి అతడు అవుట్

ఈ వారం షో నుంచి అతడు అవుట్

దెయ్యం జలజ ఎంట్రీతో ఈ వారం బిగ్ బాస్ షోలో ఊహించని సంఘటనలు జరిగాయి. దీంతో ఓటింగ్ పొజిషన్స్ కూడా తారుమారయ్యాయి. ఇక, శనివారం ఎపిసోడ్‌లో మోనాల్ సేవ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. తాజా సమాచారం ప్రకారం... ఈ వారం అతి తక్కువ ఓట్లు తెచ్చుకుని ఎలిమినేట్ అయ్యాడు జబర్ధస్త్ అవినాష్. ఈ విషయాన్ని ఆదివారం ఎపిసోడ్‌లో వెల్లడించనున్నారు.

ఆదివారం ఎపిసోడ్‌ చివర్లో హైడ్రామా

ఆదివారం ఎపిసోడ్‌ చివర్లో హైడ్రామా

అవినాష్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. దీని ప్రకారం 12, 13 వారాల్లో ఎప్పుడైనా ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చు. అయితే, అతడు ఈ వారమే ఎలిమినేట్ అవడంతో, ఆ పాస్‌ను ఇప్పుడే వాడుకున్నాడని తెలిసింది. ఎన్నో హైడ్రామాల మధ్య సాగిన ఆదివారం ఎపిసోడ్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా ఎలిమినేషన్ తప్పించుకున్నాడు జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
12వ వారం ఓటింగ్ వివరాలు ఇలా

12వ వారం ఓటింగ్ వివరాలు ఇలా

12వ వారానికి సంబంధించి నలుగురు కంటెంస్టెంట్లు మాత్రమే నామినేట్ అయ్యారు. అయినప్పటికీ తొమ్మిదిన్నర కోట్ల ఓట్లు పోలయ్యాయని శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున వెల్లడించాడు. ఇక, ఈ వారంలో మోనాల్ గజ్జర్ ఎక్కువ ఓట్లతో మొదటి స్థానం సాధించగా, అఖిల్ రెండు, ఆరియానా మూడో స్థానంలో నిలిచారు. అవినాష్ తక్కువ ఓట్లతో చివర్లో ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X