12th Week Nomination: ఈ వారం నలుగురు నామినేట్.. ఓ కంటెస్టెంట్‌ను సేవ్ చేసిన కెప్టెన్!

బుల్లితెర చరిత్రలోనే ఏ షోకూ దక్కని స్పందనను అందుకుంటూ తెలుగులో నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతున్నప్పటికీ మన దగ్గర మాత్రమే భారీ స్థాయిలో రేటింగ్ వస్తోంది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ సైతం ఒకే రకమైన స్పందనతో దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లీకులు బిగ్ బాస్ యూనిట్‌ను కలవర పెడుతున్నాయి. ఇప్పుటికే ఎన్నో విషయాలు బయటకు రాగా, తాజాగా 12వ వారం నామినేషన్ ప్రక్రియ లీకైంది. నామినేట్ అయిన వారి పేర్లు తెలిసిపోయాయి. ఆ వివరాలు మీకోసం.!

నేషనల్ రికార్డుతో హాట్ టాపిక్‌

నేషనల్ రికార్డుతో హాట్ టాపిక్‌

తెలుగు బిగ్ బాస్ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వాటిలో ఎన్నో ఎపిసోడ్లు భారీ స్థాయిలో రేటింగ్ సాధించి షోను నెంబర్ వన్ స్థానంలో నిలిపాయి. ఇక, ప్రస్తుత సీజన్‌ సైతం వాటికి మించిన స్పందనను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రీమియర్ ఎపిసోడ్‌కు జాతీయ స్థాయిలో రికార్డు రేటింగ్ సాధించి హాట్ టాపిక్ అయిపోయింది.

వాటిని చాలా వరకు మార్చారు

వాటిని చాలా వరకు మార్చారు

గత సీజన్లలో బిగ్ బాస్ నిర్వహించే టాస్కులన్నీ ఒకేలా కనిపించేవి. దీంతో నామినేషన్ ప్రక్రియ, వీకెండ్ ఎపిసోడ్స్ మినహా మిగిలిన వాటికి పెద్దగా స్పందన వచ్చేది కాదు. కానీ, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో వచ్చిన టాస్కుల్లో కొత్తదనం కనిపించింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్, కెప్టెన్సీ టాస్క్ సహా వీకెండ్ గేమ్స్ అన్నీ గతంలో చూడనివే పెడుతున్నారు నిర్వహకులు.

ఆ విషయంలో మాత్రం డౌట్లు

ఆ విషయంలో మాత్రం డౌట్లు

బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా నడిచేదే అయినా.. అందులో జరిగే చాలా విషయాలు అలా అనిపించవు. మరీ ముఖ్యంగా కొన్ని గొడవలు, ఎమోషనల్ మూమెంట్స్ డైరెక్షన్ ప్రకారమే జరుగుతున్నాయన్న భావన ప్రేక్షకుల్లో కలిగింది. ఇక, ఎలిమినేషన్ విషయంలో ఇప్పటికీ నమ్మశక్యం కానీ ఎన్నో పరిణామాలు చోటు చేసుకోవడంతో షోపై డౌట్లు పెగుతూనే ఉన్నాయి.

సోమవారం మాత్రం రచ్చ రచ్చే

సోమవారం మాత్రం రచ్చ రచ్చే

బిగ్ బాస్ షోలో అత్యంత ముఖ్యమైనది సోమవారం జరిగే నామినేషన్ ప్రక్రియే అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇంటి నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే విషయమై కంటెస్టెంట్లు ఇద్దరేసి హౌస్‌మేట్లను ఎంపిక చేసుకుంటుంటారు. ఈ సందర్భంగా ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. ఈ సీజన్‌లో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో నామినేషన్ ప్రక్రియ హైలైట్ అవుతూనే ఉంది.

ఈ వారం నలుగురు నామినేట్

ఈ వారం నలుగురు నామినేట్

సోమవారం ప్రసారం కానున్న నామినేషన్ ప్రక్రియ ముందే లీక్ అయింది. తాజా సమాచారం ప్రకారం.. 12వ వారానికి సంబంధించి నలుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వారిలో జబర్ధస్త్ అవినాష్, అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్, ఆరియానా గ్లోరీ ఉన్నారు. దేత్తడి హారిక, సోహెల్ రియాన్, అభిజీత్ మాత్రం సేవ్ అయ్యారు. ఈ ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగానే సాగినట్లు తెలిసింది.

 కంటెస్టెంట్‌ను సేవ్ చేసిన కెప్టెన్

కంటెస్టెంట్‌ను సేవ్ చేసిన కెప్టెన్

వాస్తవానికి ఈ నామినేషన్ ప్రక్రియలో అభిజీత్ కూడా నామినేట్ అయ్యాడట. అయితే, ఇంటి కెప్టెన్ అయిన దేత్తడి హారికకు బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేకమైన అధికారంతో అతడిని సేవ్ చేసిందని కూడా ఓ న్యూస్ లీకైంది. వీళ్లిద్దరి మధ్య సీజన్ ఆరంభం నుంచే ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. ఈ కారణంగానే హారిక అభిజీత్‌ను సేవ్ చేసి ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X