Bigg Boss Telugu 7: 12వ వారం ఎలిమినేషన్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం!
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఇక ఈ సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంటుంది. గత 12వారాలుగా ఈ షో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా నాగార్జున హోస్టుగా చక్కగా ఈ రియాలిటీ షోను నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక 12వ వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు? అనే ప్రశ్నకు భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. అమర్‌దీప్ ఎలిమినేట్ అవుతారని 8 శాతం మంది ఓటు వేయగా, శివాజీకి 10.6 శాతం మంది ఓటు, యావర్ కు 2.6 శాతం మంది ఓటు, గౌతమ్ అని 6.6 శాతం మంది ఓటు వేశారు. రతిక రోజ్ అని 30 శాతం మంది ఓటు వేయగా.. అర్జున్ అని 6.6 శాతం మంది ఓటు వేశారు. ప్రశాంత్ అని 6.6 శాతం మంది ఓటు వేయగా, అశ్విని శ్రీ అని 28 శాతం మంది ఓటు వేశారు. ఈ ఓటింగ్ ఫలితాలను బట్టి చూస్తే... ఈ వారం ఎలిమినేషన్లో రతికా రోజ్ ఎలిమిమేట్ కావాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7లో 12వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనే ప్రశ్నకు అవును అని 63 శాతం మంది ఓటు వేశారు. కాదు అని 20 శాతం మంది ఓటు వేయగా.. ఏమీ చెప్పలేమని 17 శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే.. 12వ వారం డబుల్ ఎలిమిమేషన్ ఉంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 7 ఎలా సాగుతున్నది? అనే ప్రశ్నకు బాగుంది అని 37.6 శాతం మందికి బాగాలేదు అని 45 శాతం మంది ఓటు వేశారు. ఏమీ చెప్పలేమని 17 శాతం మంది ఓటు వేశారు. బిగ్‌బాస్ తెలుగు 7 బాగాలేదని నెటిజన్స్ భావిస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో ఎవరు విజేతగా నిలుస్తారని అనుకొంటున్నారు? అనే ప్రశ్నకు భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. ఇక ఈ సీజన్ విన్నర్ అని శివాజీకి 45 శాతం మంది ఓటు వేశారు. గౌతమ్ కృష్ణకు 4 శాతం మంది ఓటు వేశారు. ప్రియాంక జైన్ కు 5.8 శాతం మంది ఓటు వేయగా.. శోభా శెట్టికి 5.8 శాతం ఓటు వేశారు. రతిక రోజ్ విన్నర్ అని 0 శాతం మంది ఓటు వేయగా.. ప్రిన్స్ యావర్ కు 2 శాతం మంది ఓటు వేశారు. ఇక అమర్ దీప్ కు 16 శాతం మంది, అశ్వినీ శ్రీకి 2 శాతం మంది, పల్లవి ప్రశాంత్ 17 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన ఈ సీజన్ విన్నర్ శివాజీ అని నెటిజన్స్ అనుకుంటున్నారు.
శివాజీ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్నకు అవును అని 55 శాతం మంది, కాదు అని 42 శాతం మంది, చెప్పలేమని 3 శాతం మంది ఓటు వేశారు. దీంతో శివాజీ కన్నింగ్ గేమ్ ఆడుతున్నట్లు నెటిజన్స్ భావిస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో క్లీన్‌గా గేమ్ ఆడుతున్నది ఎవరు? అనే ప్రశ్నకు శివాజీ అని 35 శాతం మంది, గౌతమ్ కృష్ణ అని 8.6 శాతం మంది, ప్రియాంక జైన్ అని 9.62 శాతం మంది, శోభా శెట్టి అని 5.7 శాతం మంది, రతిక అని 5 శాతం మంది, ప్రిన్స్ యావర్ అని 4 శాతం మంది, అమర్ దీప్ అని 11 శాతం మంది, అశ్వినీ శ్రీ అని 3 శాతం మంది, పల్లవి ప్రశాంత్ అని 14 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన క్లీన్ గేమ్ ఆడుతున్నది పల్లవి శివాజీ అని తేలింది.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో చెత్తగా గేమ్ ఆడుతున్నది ఎవరు? అనే ప్రశ్నకు శివాజీ అని 25 శాతం మంది, గౌతమ్ కృష్ణ అని 9 శాతం మంది, ప్రియాంక జైన్ అని 3 శాతం మంది, శోభా శెట్టి అని 15 శాతం మంది, రతిక అని 22 శాతం మంది, ప్రిన్స్ యావర్ అని 1 శాతం మంది, అమర్ దీప్ అని 8.4 శాతం మంది, అశ్వినీ శ్రీ అని 7 శాతం మంది, పల్లవి ప్రశాంత్ అని 7 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన ఈ సీజన్ లో చెత్తగా గేమ్ ఆడుతున్నది శివాజీ అని తేలింది.


Click it and Unblock the Notifications











