ఒకే ఒక్క ఎపిసోడ్‌తో మారిన ఓటింగ్: పైనున్న కంటెస్టెంట్ చివరకు.. ఏకంగా మూడో స్థానంలోకి అతడు!

తెలుగు బుల్లితెరపై ఏ షోకూ సాధ్యం కాని రీతిలో స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది బిగ్ బాస్. అదే సమయంలో అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు పూర్తయిన మూడు సీజన్లూ సూపర్ హిట్ అవగా.. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌ కూడా అదే రీతిలో దూసుకుపోతోంది. ఇక, ఫినాలేకు దగ్గర అవడంతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటింగ్ సరళి ఊహించని విధంగా సాగుతోంది. దీంతో పైనున్న వారు కిందకు, కింది వారు పైకి వెళ్లారు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

ఈ వారం ఐదుగురు సభ్యులు నామినేట్

ఈ వారం ఐదుగురు సభ్యులు నామినేట్

13వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియలో ప్రతి ఇంటి సభ్యుడు కలర్ నింపిన ట్యూబ్‌లను మెడలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కంటెసెంట్ నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు సభ్యుల కంటైనర్లలో పోయాలి. ఎవరి కంటైనర్‌లో ఎక్కువ కలర్ వాటర్ ఉంటే వాళ్లు నామినేట్ అయినట్లు. ఈ జాబితాలో అవినాష్, మోనాల్, అభిజీత్, మోనాల్, అఖిల్‌లు నామినేట్ అయ్యారు.

వాళ్లిద్దరూ టాప్‌... అతడే అందరిలో లీస్ట్

వాళ్లిద్దరూ టాప్‌... అతడే అందరిలో లీస్ట్

నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఎపిసోడ్ పూర్తయిన వెంటనే ఓటింగ్ మొదలవుతుంది. ఆరోజు రాత్రితో పాటు తర్వాత రోజు జరిగిన పోలింగ్‌లో ఎప్పటి లాగే అభిజీత్ టాప్ ప్లేస్‌ను అందుకోగా, ఆ తర్వాతి స్థానంలో దేత్తడి హారిక నిలిచింది. మూడు నాలుగు స్థానాల్లో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ ఉన్నారు. ఇక, తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్.

ఓటింగ్‌ను మార్చిన రేస్ టు ఫినాలే టాస్క్

ఓటింగ్‌ను మార్చిన రేస్ టు ఫినాలే టాస్క్

నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రోజు.. బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది. మూడు రౌండ్లలో జరిగే ఈ టాస్కులో విజేతగా నిలిచిన కంటెస్టెంట్.. నేరుగా ఫినాలేకు అర్హత సాధిస్తారు. అయితే, సదరు ఇంటి సభ్యుడు ఈ వారం ఎలిమినేషన్ తప్పించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి సభ్యుడు ప్రాణం పెట్టి పోరాటం చేయాలని బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సూచించాడు.

ఒకే ఒక్క ఎపిసోడ్‌తో మారిన ఓటింగ్ సరళి

ఒకే ఒక్క ఎపిసోడ్‌తో మారిన ఓటింగ్ సరళి

‘రేస్ టు ఫినాలే' మొదటి లెవెల్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు నుంచి వచ్చే పాలను తమ దగ్గర ఉన్న బాటిల్స్‌లో నింపుకోవాలి కంటెస్టెంట్లు. ఈ టాస్కులో భాగంగా అవినాష్‌ను మోనాల్ కాలితో తన్నింది. అంతేకాదు, అఖిల్.. సోహెల్ మిగిలిన కంటెస్టెంట్లకు ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరూ కలిసి గేమ్ ఆడారు. దీంతో ఓటింగ్ సరళి ఒక్కసారిగా మారిపోయిందని తెలిసింది.

పైనున్న కంటెస్టెంట్ చివరకు.. ఆమె కూడా

పైనున్న కంటెస్టెంట్ చివరకు.. ఆమె కూడా

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘రేస్ టు ఫినాలే' టాస్క్ ముందు వరకూ నాలుగో స్థానంలో ఉన్న మోనాల్ గజ్జర్.. ఆ తర్వాత చివరి స్థానానికి పడిపోయిందట. అలాగే దేత్తడి హారిక సైతం నాలుగో స్థానానికి పడిపోయిందని సమాచారం. ఇందులో అభిజీత్ మాత్రం టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అలాగే, అఖిల్ సార్థక్ రెండో స్థానానికి చేరుకున్నాడని తెలుస్తోంది.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
ఏకంగా మూడో స్థానంలోకి దూసుకెళ్లాడు

ఏకంగా మూడో స్థానంలోకి దూసుకెళ్లాడు

ఓటింగ్ ప్రారంభం అయిన రెండు రోజులూ చివరి స్థానంలో నిలిచిన ముక్కు అవినాష్.. అధికారిక ఓటింగ్‌ ప్రకారం.. ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకున్నాడని సమాచారం. ‘రేస్ టు ఫినాలే'లో అతడికి అన్యాయం జరగడం.. మోనాల్ గజ్జర్ కాలితో తన్నడం వంటి వాటి వల్లే ఓటింగ్ ఒక్కసారిగా తారుమారయిందని అంటున్నారు విశ్లేషకులు. చివరికి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X