Bigg Boss Elimination: చివరి నిమిషంలో మారిన రిజల్ట్.. షో నుంచి ఊహించని కంటెస్టెంట్ ఔట్

బిగ్ బాస్ షో అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పటి వరకు ఇదే రీతిలో కొనసాగుతూ వచ్చిందీ షో. అయితే, గత మూడు సీజన్లకు భిన్నంగా ఈ సారి హౌస్‌లో జరిగే ప్రతి విషయం కొన్ని గంటల ముందే లీకైపోతుంది. మరీ ముఖ్యంగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ఆదివారం వరకూ ఆగాల్సిన పని లేకుండా శనివారమే బయటకు వచ్చేస్తుంది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers

ఇలా 13వ వారం కూడా ఈ వివరాలు రివీల్ అయ్యాయి. ఈ క్రమంలోనే మోనాల్ గజ్జర్ బయటకు వెళ్లిందని అందరూ చెప్పారు. కానీ, ఆమె సేఫ్ అయిందట. అదే సమయంలో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఈ వారం నామినేషన్‌లో ఐదుగురు

ఈ వారం నామినేషన్‌లో ఐదుగురు

గత ఎపిసోడ్లతో పోలిస్తే పోయిన సోమవారం జరిగిన నామినేషన్స్ టాస్కు మాత్రమే ఎటువంటి గొడవలు లేకుండా జరిగింది. బాగా ఎమోషనల్‌గా సాగిన ఈ టాస్కులో అవినాష్, అభిజీత్, అఖిల్ సార్థక్, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్‌లు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్స్‌లో కనిపించిన ఆటతీరుతో ఓటింగ్‌లో చాలా మార్పులు కనిపించినట్లు ప్రచారం జరిగింది.

అఖిల్ సార్థక్‌కు రెండు సర్‌ఫ్రైజులు

అఖిల్ సార్థక్‌కు రెండు సర్‌ఫ్రైజులు

13 వారం జరిగిన ‘రేస్ టు ఫినాలే' టాస్కులో విజయం సాధించిన అఖిల్ సార్థక్‌ను శనివారం హోస్ట్ అక్కినేని నాగార్జున అభినందించాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న ఆ మెడల్‌ను తీసుకోవాలని చెప్పాడు. అంతేకాదు, ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయినట్లు కూడా ప్రకటించాడు. అనంతరం ఫినాలే మెడల్‌ను సోహెల్‌తో వేయించుకున్నాడు. అంటే ఒకేసారి రెండు గిఫ్ట్స్ అందుకున్నాడు.

మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్ అంటూ

మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్ అంటూ

ఎప్పటి లాగే 13వ వారానికి సంబంధించి ఎలిమినేట్ అవబోయే కంటెస్టెంట్ విషయంలో చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయినట్లు శనివారం సాయంత్రమే ఓ న్యూస్ తెగ హల్‌చల్ చేసింది. అంతేకాదు, ఇంటి నుంచి బయటకు వెళ్లే క్రమంలో ఆమె బోరున విలపించిందని, అఖిల్ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడని ప్రచారం జరిగింది.

చివరి నిమిషంలో మారిన రిజల్ట్

చివరి నిమిషంలో మారిన రిజల్ట్

మోనాల్ గజ్జర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందన్న వార్తలు వచ్చినప్పటికీ.. ఆమె బిగ్ బాస్ దత్త పుత్రిక కదా ఈ సారి కూడా ఎలిమినేట్ చేయరు అన్న అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. అందుకు అనుగుణంగానే మోనాల్‌ను సేఫ్ చేసినట్లు తాజాగా మరో న్యూస్ లీకైంది. చివరి నిమిషంలో ఆమె స్థానంలో మరో కంటెస్టెంట్‌ను బయటకు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

షో నుంచి ఊహించని కంటెస్టెంట్ ఔట్

షో నుంచి ఊహించని కంటెస్టెంట్ ఔట్

వాస్తవానికి ఈ వారం ఆటతీరు చూసిన వారంతా మోనాల్ గజ్జర్ వెళ్లిపోవడం ఖాయమని అనుకున్నారు. అందుకు అనుగుణంగా ఆమె ఎలిమినేట్ అయినట్లు వార్తలు కూడా ప్రచారం అవడంతో ఇదంతా నిజమేనని నమ్మారు చాలా మంది. కానీ, ఊహించని విధంగా జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌ను హౌస్‌ నుంచి బయటకు పంపించారని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

ముందే అనుకున్నా.. దాంతో మారింది

ముందే అనుకున్నా.. దాంతో మారింది

అవినాష్ నామినేషన్స్‌లో ఉంటే అస్సలు తట్టుకోలేడు. ఇదే ఈ వారం జరిగిన రేస్‌ టు ఫినాలే టాస్కులోనూ కనిపించింది. దీంతో అతడు వెళ్లిపోతాడేమో అనుకున్నారు. కానీ, మోనాల్ గజ్జర్ కాలితో తన్నిన తర్వాత, అఖిల్ - సోహెల్ కలిసి ఆడిన తర్వాత అవినాష్ గ్రాఫ్ పెరిగిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు, అతడు ఏకంగా మూడో స్థానంలో ఉన్నాడని కూడా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X