బిగ్ బాస్ లీక్: అభిజీత్‌కు కోలుకోలేని షాక్.. నమ్మిన కంటెస్టెంటే అలా చేయడంతో తట్టుకోలేక!

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అభిజీత్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడాతను. కానీ, అంతగా గుర్తింపు దక్కలేదు. అయితే, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనడం వల్ల ఊహించని రీతిలో పాపులారిటీని అందుకున్నాడు. దీంతో అతడి పేరు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అభిజీతే ఈ సీజన్ విన్నర్ అన్న టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‌లో అతడికి కోలుకోలేని షాక్ తగిలింది. అది కూడా ఓ నమ్మిన వ్యక్తి వల్లే అని తెలిసింది. అసలేం జరిగిందంటే...

ఆమెతో ట్రాక్‌తో టాక్.... లవర్ బాయ్‌ పేరు

ఆమెతో ట్రాక్‌తో టాక్.... లవర్ బాయ్‌ పేరు

టాలీవుడ్ హీరోగా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్. అతడు స్టేజ్ మీద ఉన్న సమయంలో మోనాల్ గజ్జర్‌ను పెళ్లి చేసుకుంటాన్న కామెంట్‌తో హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోనూ అందుకు అనుగుణంగానే ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. దీంతో వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి అతడిని లవర్ బాయ్ అనేస్తున్నారంతా.

మోనాల్‌కు బైబై.... హారికతో చెట్టాపట్టాలు

మోనాల్‌కు బైబై.... హారికతో చెట్టాపట్టాలు

మోనాల్‌తో బంధం బలపడుతోన్న సమయంలోనే అఖిల్ సార్థక్.. వీళ్లిద్దరి మధ్యలోకి వచ్చాడు. సరిగ్గా అప్పుడే సదరు హీరోయిన్ కూడా అతడి వైపు వెళ్లిపోయింది. అప్పటి నుంచి కొద్ది రోజుల పాటు ఒంటరిగా ఉన్న అభిజీత్.. తనను ఇష్టపడే దేత్తడి హారికతో క్లోజ్ అయ్యాడు. ఆరోజు నుంచి ఈ ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు. దీంతో వీళ్లిద్దరిని ప్రేమికులుగా ఊహించుకుంటున్నారు ప్రేక్షకులు.

ఆ విషయంలో మాత్రం అభిపై విమర్శలు

ఆ విషయంలో మాత్రం అభిపై విమర్శలు

సీజన్ ఆరంభంలో జరిగిన ఓ టాస్కులో మైండ్ గేమ్‌తో తన జట్టును గెలిపించాడు అభిజీత్. అప్పటి నుంచి అతడికి మంచి పేరు వచ్చింది. అదే సమయంలో ఫిజికల్ టాస్కులు ఆడలేడన్న చెడ్డ పేరును సైతం మూటగట్టుకున్నాడు. వాస్తవానికి అభి అలాంటి టాస్కుల్లో ప్రయత్నం చేసినా బలవంతులు ఉండడం వల్ల తేలిపోయేది. దీంతో అతడి ఆట కనిపించక విమర్శలపాలయ్యాడు.

నాగార్జున సీరియస్.. వీడియోలు చూపించి

నాగార్జున సీరియస్.. వీడియోలు చూపించి

గత వారం జరిగిన దెయ్యం టాస్కులో జలజ తనకు ఇచ్చిన రెండు టాస్కులను తిరస్కరించాడు అభిజీత్. దీంతో అతడిని వరస్ట్ పెర్ఫార్మర్ అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హోస్ట్ అక్కినేని నాగార్జున సైతం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు, హౌస్ గేట్లు ఓపెన్ చేయించి ఇంటి నుంచి బయటకు పంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

బిగ్ బాస్ లీక్: అభిజీత్‌కు కోలుకోలేని షాక్

బిగ్ బాస్ లీక్: అభిజీత్‌కు కోలుకోలేని షాక్

నాగార్జున ఫైర్ అవడంతో అభిజీత్‌ అభిమానులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అంతేకాదు, అతడిని టార్గెట్ చేయొద్దంటూ పెద్ద ఉద్యమానికే తెరలేపారు. ఈ సమయంలో ఈ హీరో క్రేజ్ చూసిన వారంతా నాలుగో సీజన్ విన్నర్ అతడేనని ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభిజీత్‌కు కోలుకోలేని షాక్ తగిలినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

నమ్మిన వ్యక్తే అలా చేయడంతో తట్టుకోలేక

నమ్మిన వ్యక్తే అలా చేయడంతో తట్టుకోలేక

నాగ్ వార్నింగ్ ప్రభావమో.. ఇంకే కారణమో తెలియదు కానీ.. 13వ వారం నామినేషన్ టాస్కులో దేత్తడి హారిక... అభిజీత్‌ను నామినేట్ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఘటనతో అతడితో పాటు హౌస్‌మేట్స్ అంతా షాక్ అయ్యారని టాక్. అంతేకాదు, ఈ ప్రక్రియలో అభిజీత్ కూడా హారికను నామినేట్ చేశాడని కూడా తెలిసింది. దీంతో సోమవారం ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X