Bigg Boss Telugu 7: 13వ వారం నామినేషన్స్... టికెట్ టు ఫినాలేకి ఎవరు వెళ్లనున్నారంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ లవర్సే కాకుండా సామాన్యులు సైతం ఈ సీజన్ ను ఇష్టపడుతున్నారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వల్ల రతికా రోజ్, అశ్విని శ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఎవరు టికెట్ టు ఫినాలేకి వెళ్తారు.. ఎవరు నెక్ట్స్ వీక్ నామినేషన్స్ లో ఉన్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అత్యధిక ఆదరణ పొందిన షోల్లో బిగ్ బాస్ తెలుగు ఒకటి. అయితే గత సీజన్స్ కంటే ఈ సీజన్ ఆసక్తిగా సాగుతోంది. ఉల్టా పుల్టా అంటూ వారం వారం బిగ్ బాస్ ట్విస్టులు, షాకులు ఇస్తున్నాడు. ఇక 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గతవారమే నాగార్జున చెప్పాడు. ఇక ఈ వారం రతికా రోజ్, అశ్విని శ్రీ ఎలిమినేట్ అయ్యారు. అలా ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, గౌతమ్, అర్జున్ ఉన్నారు.

13th week Nominations and Ticket to Finale Contestants List in Bigg Boss Telugu 7 Full Details Here

ఇక వీరిలో ఎవరు టికెట్ టు ఫినాలికి వెళ్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇక 13వ వారం నామినేషన్స్ ప్రారంభం అయినట్లు బిగ్ బాస్ వర్గాల సమాచారం. ఇక నెక్ట్స్ వారం కూడా హాట్ హాట్ గా నామినేషన్స్ ప్రక్రియ మొదలు అయినట్లు తెలుస్తోంది. పెయింట్ తో నచ్చని కంటెస్టెంట్ మొహం మీద గీసి నామినేట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారంట.

13వ వారం నామినేషన్స్ లిస్టులో ప్రశాంత్ తప్ప.. మిగతా ఇంటి సభ్యులందరూ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గొడవలు భారీ ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ మాత్రం ఈ వారం తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వాళ్లు సేవ్ అయితేనే టికెట్ టు ఫినాలేకి వెళ్తారు. ఇక టికెట్ టు ఫినాలికే వెళ్లేందుకు కంటెస్టెంట్స్ గట్టి పోటీని ఇచ్చేందుతు సిద్ధం అయ్యారు.

13th week Nominations and Ticket to Finale Contestants List in Bigg Boss Telugu 7 Full Details Here

సీజన్ 7 కాబట్టి.. సెవెన్ టాస్కులు ఉండనున్నాయి. అందులో వాటిని ఎవరు అయితే బెస్ట్ ఫెర్మామెన్స్ ఇస్తారో వారు టికెట్ టు ఫినాలేకి వెళ్లే అర్హత పొందుతారు. ఇక ఫస్టు టాస్కు ఇసుకలో ఫిజికల్ టాస్కు ఉండనుందని తెలుస్తోంది. రెండు, మూడు టాస్కులు సైతం ఫిజికల్ గానే నిర్వహించనున్నారంట. ఇక 4వ టాస్కు మాత్రం బ్రెయిన్ కి సంబంధించిన టాస్కు అని తెలుస్తోంది.

13th week Nominations and Ticket to Finale Contestants List in Bigg Boss Telugu 7 Full Details Here

ఇక 5వ టాస్కు రన్నింగ్ టాస్కు కాగా... ఆరో టాస్కు ఫిజికల్ టాస్కు అని తెలుస్తోంది. ఇక చివరి 7వ టాస్కును భారీ ఎత్తున ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ 7 టాస్కులు విన్ అయితేనే టికెట్ టు ఫినాలేకి చేరుకుంటారు. ఇక ఈ సీజన్ 7 కాబట్టి.. టాప్ 7 తీసుకువెళ్లాలని బిగ్ బాస్ ప్రయత్నం చేస్తోంది. చూడాలి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X