Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం!
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక మరో రెండు వారాల్లో ఈ షో ముగియనుంది. గత 13 వారాలుగా ఈ షో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా నాగార్జున హోస్టుగా చక్కగా ఈ రియాలిటీ షోను నడిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక 13వ వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 13వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు? అనే ప్రశ్నకు శివాజీ అని 22 శాతం మంది ఓటు వేయగా.. యావర్ కు 4 శాతం మంది, గౌతమ్ కు 14 శాతం మంది, అర్జున్ కు 17 శాతం మంది, ప్రశాంత్ కు కు 2 శాతం మంది, ప్రియాంకకు 3 శాతం మంది, శోభా శెట్టి కు 34 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ వారం నెటిజన్స్ దృష్టిలో .... శోభా శెట్టి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్ తెలుగు 7 ఎలా సాగుతున్నది? అనే ప్రశ్నకు బాగుంది అని 25 శాతం మందికి బాగాలేదు అని 56 శాతం మంది ఓటు వేశారు. ఏమీ చెప్పలేమని 19 శాతం మంది ఓటు వేశారు. బిగ్‌బాస్ తెలుగు 7 బాగాలేదని నెటిజన్స్ భావిస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో ఎవరు విజేతగా నిలుస్తారని అనుకొంటున్నారు? అనే ప్రశ్నకు భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. ఇక ఈ సీజన్ విన్నర్ అని శివాజీకి 63 శాతం మంది ఓటు వేశారు. గౌతమ్ కృష్ణకు 2 శాతం మంది ఓటు వేశారు. ప్రియాంక జైన్ కు 1 శాతం మంది ఓటు వేయగా.. శోభా శెట్టికి 2 శాతం ఓటు వేయగా... ప్రిన్స్ యావర్ కు 2 శాతం మంది ఓటు వేశారు. ఇక అమర్ దీప్ కు 13 శాతం మంది, పల్లవి ప్రశాంత్ 15 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన ఈ సీజన్ విన్నర్ శివాజీ అని నెటిజన్స్ అనుకుంటున్నారు.
శివాజీ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్నకు అవును అని 39 శాతం మంది, కాదు అని 55 శాతం మంది, చెప్పలేమని 5 శాతం మంది ఓటు వేశారు. దీంతో శివాజీ కన్నింగ్ గేమ్ ఆడుతున్నట్లు నెటిజన్స్ భావించడం లేదు..
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో క్లీన్‌గా గేమ్ ఆడుతున్నది ఎవరు? అనే ప్రశ్నకు శివాజీ అని 51 శాతం మంది, గౌతమ్ కృష్ణ అని 7 శాతం మంది, ప్రియాంక జైన్ అని 5 శాతం మంది, శోభా శెట్టి అని 5 శాతం మంది, ప్రిన్స్ యావర్ అని 4 శాతం మంది, అమర్ దీప్ అని 9 శాతం మంది, పల్లవి ప్రశాంత్ అని 15 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన క్లీన్ గేమ్ ఆడుతున్నది పల్లవి శివాజీ అని తేలింది.
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో చెత్తగా గేమ్ ఆడుతున్నది ఎవరు? అనే ప్రశ్నకు శివాజీ అని 29 శాతం మంది, గౌతమ్ కృష్ణ అని 7 శాతం మంది, ప్రియాంక జైన్ అని 5 శాతం మంది, శోభా శెట్టి అని 22 శాతం మంది, ప్రిన్స్ యావర్ అని 5 శాతం మంది, అమర్ దీప్ అని 16 శాతం మంది, పల్లవి ప్రశాంత్ అని 4 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన ఈ సీజన్ లో చెత్తగా గేమ్ ఆడుతున్నది శివాజీ అని తేలింది.
బిగ్‌బాస్ తెలుగు 7లో టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? గౌతమ్ కు 8.24 శాతం మంది, అర్జున్ కు 21.18 శాతం మంది, శివాజీకు 20 శాతం మంది, యావర్ కు 2 శాతం మంది, ప్రశాంత్ కు 13 శాతం మంది, అమర్ దీప్ కు 25 శాతం మంది, ప్రియాంక జైన్ కు 6 శాతం మంది, శోభా శెట్టికు 2 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ వారం టికెట్ టు ఫినాలే అర్జున్ గెలుచుకుంటారని నెటిజన్స్ భావించారు. అన్నట్లుగానే ఈ వారం అర్జున్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు.
ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అంటున్నారు. ప్రశాంత్ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ యూజ్ చేసి.. డేంజర్ జోన్ లో ఉన్న శోభా శెట్టిని సేవ్ చేసేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే గనుక ఈ వారం శోభా శెట్టి అవుట్ కానుంది.


Click it and Unblock the Notifications











