14 Week Elimination: ఈ వారం కూడా అదే తరహా ట్విస్ట్.. షో నుంచి మరో ఫైటర్ ఎలిమినేట్!
ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ నాలుగేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తవగా, నాలుగో సీజన్ కూడా అదే రీతిలో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో అనూహ్యమైన పరిణామాలు ఎన్నో జరుగుతున్నాయి. వీటిలో ఊహించని కంటెస్టెంట్ల ఎలిమినేషన్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే 14వ వారం కూడా అదే తరహా ఎలిమినేషన్ జరగబోతుందని తెలుస్తోంది. దీని వల్ల ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్న కంటెస్టెంట్ కాకుండా మరొకరు వెళ్లిపోతారని అంటున్నారు. అసలేం జరుగుతోంది? పూర్తి వివరాలు మీకోసం!

నాలుగో సీజన్‌లో అంచనాలను మించి
తెలుగులో బిగ్ బాస్ షో జరిగిన మూడు సార్లూ ఏం జరగబోతుందో ముందే అర్థం అయిపోయేది. ఆ వారం కంటెస్టెంట్ల ఆటను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై చాలా మంది ముందుగానే అంచనా వేసేసేవారు. కానీ, నాలుగో సీజన్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ప్రజాదరణ ఉన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతుండడంతో అనుమానాలు మొదలయ్యాయి.

ఆమె ఒక్కదాని కోసమే చాలా మందిని
బిగ్ బాస్ షో అంటేనే రియాలిటీ ఆధారంగా నడిచే షో. హౌస్‌లోని కంటెస్టెంట్లు రియల్ క్యారెక్టర్లను బయట పెడతారు. అందులో తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేస్తారు ప్రేక్షకులు. కానీ, ఈ సీజన్‌లో ఓట్లు తక్కువ వచ్చిన వారిని కాకుండా కావాలనే కొందరిని ఎలిమినేట్ చేశారన్న టాక్ వినిపించింది. మరీ ముఖ్యంగా మోనాల్‌ను కావాలనే ఉంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

బిగ్ బాస్ నిర్వహకులపై విమర్శల వర్షం
ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్ జరగాలి. కానీ, రేటింగ్ కోసం కొందరిని ఉంచి, మంచిగా ఆడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నారన్న అభిప్రాయాలు బాగా వ్యక్తం అవుతున్నాయి. దేవీ నాగవల్లి, కుమార్ సాయి, దివి, లాస్య, అవినాష్‌లు ఎలిమినేట్ అవడాన్ని ప్రేక్షకులు తప్పుబట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో బిగ్ బాస్ నిర్వహకులపై విమర్శల వర్షం కురిసింది.

ఈ వారం ఐదుగురు.. టాప్-5లో ఎవరు?
ఫినాలేకు ముందు చివరి నామినేషన్ ఈ వారంలో జరిగింది. ఎంతో కీలకమైన పరిస్థితుల్లో అఖిల్ సార్థక్ మినహా మిగిలిన ఐదుగురిని నేరుగా నామినేట్ చేశాడు బిగ్ బాస్. వీరికి టాస్కులు ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని సూచించాడు. అందుకు అనుగుణంగానే టాస్కులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్‌గా మారింది.

14వ వారం కూడా అదే తరహా బిగ్ ట్విస్ట్
వాస్తవానికి ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. గత వారంలో మాదిరిగానే ఈ సారి కూడా మోనాల్ గజ్జర్ కారణంగానే ఇవి సంభవించాయి. దీంతో ఆమె ప్రైవేటు సంస్థలు నిర్వహించే ప్రతి పోల్‌లోనూ చివరి స్థానంలో ఉంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. మోనాల్ ఈ వారం కూడా సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
Recommended Video

షో నుంచి మరో ఫైటర్ ఎలిమినేట్ ఖాయం
కొన్ని వారాల నుంచి చూసుకుంటే ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్న మోనాల్ కాకుండా వేరే వాళ్లు ఎలిమినేట్ అవుతున్నారు. దీని బట్టి బెస్ట్ ఫైటర్‌గా పేరు తెచ్చుకున్న దేత్తడి హారిక ఈ వీక్ బయటకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే బిగ్ బాస్ షోపై విమర్శలు మరింతగా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. మరి పెద్ద బాస్ ఎవరిని పంపాలని డిసైడ్ అయ్యాడో చూడాలి.


Click it and Unblock the Notifications











